స్కూల్..కాలేజీలో కూడా వెంక‌టేష్ అంతే!

విక్ట‌రీ వెంక‌టేష్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ కామ్ గోయింగ్ హీరో. వివాదాలు...విమ‌ర్శ‌ల‌కు చాలా దూరంగా ఉంటారు.

Update: 2024-01-12 10:41 GMT

విక్ట‌రీ వెంక‌టేష్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. టాలీవుడ్ కామ్ గోయింగ్ హీరో. వివాదాలు...విమ‌ర్శ‌ల‌కు చాలా దూరంగా ఉంటారు. అస‌లు ఆ ప‌దాలంటేనే ఆయ‌న‌కు తెలియ‌వు అన‌డంలో అతిశ‌యోక్తి ఏం లేదు. ఆయ‌న వృత్తిగ‌త జీవితం ఎంత బాగుంటుందో వ్య‌క్తిగ‌త జీవితం అంత‌కు మించి ఎంతో అందంగా ఉంటుంది. అందుకే సెల‌బ్రిటీలంతా వ్య‌క్తిగ‌త జీవితంలోనూ ఆయ‌న‌లా ఉండాల‌నుకుంటారు.

జీవితం ఎలా ఉండా లి? ఎలా ఉంటే బాగుంటాం.. వంటి అంశాల గురించి వెంకీ చాలా సంద‌ర్భాల్లో అభిమానుల‌కు సూచించ‌రు. ఎలాంటి టెన్ష‌న్ లు పెట్టుకోకుండా..ఓవ‌ర్ థింకింగ్ లేకుండా ఉంటే చాలు జీవితం ప్ర‌శాంతంగా ఉంటుంది. అంత‌కు మించి కావాల్సింది ఏమి ఉంటుంద‌ని ఎప్ప‌టిక‌ప్పుడు చెబు తుంటారు. ఈ మ‌ధ్య కాలంలో సాధార‌ణ జ‌నాల‌తో ఇంట‌రాక్ట్ అవ్వ‌డం కూడా చేస్తున్నారు.

రీసెంట్ గా ఓ చిన్న హోట‌ల్ లో అంద‌రితో కలిసి టిఫిన్ చేసిన ఓ వీడియో నెట్టింట ఎలా వైర‌ల్ అయిందో తెలిసిందే. దీంతో వెంక‌టేష్ ఇంత సింపుల్ గా ఉంటారా? అని మ‌రోసారి అభిమానులంతా ఫిదా అయ్యారు. ఆయ‌న లో సింప్లిసిటీ అనేది ఇప్పుడు వ‌చ్చింది కాదు. చిన్న‌నాటి నుంచి ఆ ర‌క‌మైన వాతావ ర‌ణం అల‌వాటు చేసుకున్న‌ట్లు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో రివీల్ చేసారు. వివాదాల‌కు దూరంగా...ఇంత సుదీర్ఘ‌మై ప్ర‌యాణం చేసారు.

ఇదెలా సాధ్య‌మైంద‌ని ప్ర‌శ్నిస్తే త‌న‌దైన శైలిలో బ‌ధులిచ్చారు. `నిజంగా అది తెలిసి ఉంటే అంద‌రికీ చెప్పే వాడిని. చిన్న‌ప్ప‌టి నుంచి ఎవ‌రికీ అసౌక‌ర్యం క‌లిగించ‌కూడ‌దు అనే మ‌న‌స్త‌త్వం నాది. స్కూల్..కాలేజీలో కూడా ఇలాగే ఉండేవాడిని. ఇప్పుడు కూడా అంతే. ఎంత సింపుల్ గా ఉంటే అంత సంతోషంగా ఉంటాం` అని మ‌రోసారి త‌న‌లోని సింప్లిసిటీని బ‌య‌ట పెట్టారు. అన్న‌ట్లు ఈ సంక్రాంతి వెంకీ `సైంధ‌వ్` తో అభిమానుల్ని థ్రిల్ చేయ‌డానికి వ‌చ్చేస్తోన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    

Similar News