సొసైటీలో ఏదైనా హాట్ టాప్ నడుస్తుంటే దాని మీద సినిమాలు తీసేయడానికి జనాలు రెడీగా ఉంటారు. ఈ విషయంలో రామ్ గోపాల్ వర్మ ముందుంటాడు. ప్రస్తుతం కాపుల రిజర్వేషన్ అంశంపై నిప్పు రాజుకుంటున్న నేపథ్యంలో కాపు నేత వంగవీటి రాధా జీవిత కథతో ‘వంగవీటి’ సినిమాను తెరకెక్కించబోతున్న సంగతి తెలిసిందే. మరోవైపు కాపు ఉద్యమం మీదే ఏపీ నాయుడు అనే మరో వ్యక్తి ‘ప్రజా గర్జన’ పేరుతో ఓ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ముద్రగడ అండ్ కో చేస్తున్న ఉద్యమం నేపథ్యంలోనే ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ప్రకటించాడు నాయుడు.
ఆంధ్రప్రదేశ్ జనాభాలో 30 శాతం ఉన్న కాపుల్ని ప్రభుత్వం ఎలా అణగదొక్కుతోందో.. కాపులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేస్తామని అంటున్నాడు నాయుడు. ప్రాథమిక హక్కుల కోసం పోరాడటం కూడా ఒక హక్కే అనే నినాదం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతుందని ఆయన ప్రకటించాడు. ఇప్పటికే ముద్రగడ ఆందోళన నేపథ్యంలో ‘జయహో ముద్రగడ’ పేరుతో ఓ పాట కాపు ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఇప్పుడిక కాపు ఉద్యమంపై సినిమానే తెరకెక్కబోతుండటం విశేషమే. ఈ చిత్రంలో కొందరు కాపు నేతలు కూడా కనిపిస్తారట.