ఒక్కోసారి ఎక్కువ టాలెంట్ ఉండడం కూడా సమస్యేనా? అవును. ముఖ్యంగా మల్టిస్టారర్ సినిమాలు చేసే సమయంలో హీరోల మధ్య పోలికలు రావడం చాలా సాధారణం. విక్టరీ వెంకటేష్ ఈమధ్య ఎక్కువగా మల్టిస్టారర్లలో నటిస్తున్నారు. దీంతో చాలాసార్లు వెంకీతో తోటి నటులకు పోలికలు తప్పడం లేదు. 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' లో నటించినప్పుడు మహేష్ హ్యాండ్సమ్ హీరో .. పైగా భారీ ఫాలోయింగ్ స్టార్ కావడంతో పెద్దగా పోలికలు రాలేదు. వచ్చినా వెంకీకి దీటుగా నటించి సూపర్ స్టార్ అనిపించుకున్నాడు. పైగా వెంకీ - మహేష్ ల కాంబినేషన్ ముచ్చటగా అనిపించింది. అయితే అన్నీ సినిమాలకు అలా జరగడం లేదు.
'F2' లో వరుణ్ తేజ్ - వెంకటేష్ కలిసి నటించారు. ఈ సినిమాలో డామినేషన్ అంతా వెంకీదే. వరుణ్ పాత్ర కీలకమైనదే కానీ వెంకీ జోరు ముందు వరుణ్ తేజ్ తేలిపోయాడు. ఇప్పుడు చూస్తే 'వెంకీమామ' సినిమాలో వెంకటేష్ తన మేనల్లుడు నాగచైతన్యతో కలిసి నటిస్తున్నాడు. నాగచైతన్యకు ఇప్పటి వరకూ నటన విషయంలో అద్భుతం అనిపించుకున్న సినిమాలేవీ లేవు. దీంతో మేనమామ ముందు అల్లుడు తేలిపోతాడేమో అని కొన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ట్రైలర్ లో కూడా వెంకీ జోరు ఎక్కువగానే ఉంది. సినిమా రిలీజ్ అయితే కానీ అసలు సంగతి ఏంటో మనకు అర్థం కాదు.
వెంకీ అద్భుతమైన నటుడు.. అటు కామెడీ ఇటు ఎమోషన్ రెండిటిని పండించడంలో స్పెషలిస్టు. ఆ అనుభవాన్ని.. నటనను మ్యాచ్ చేయడం ఈ తరం హీరోలలో చాలా తక్కువమందికి మాత్రమే సాధ్యం అవుతుంది. మిగతావారికి అది కష్టమే. వెంకీతో మల్టిస్టారర్ అనగానే చాలామంది హీరోలు జంకడానికి కారణం అదేనట. అయితే ఒక్కటి మాత్రం నిజం. వెంకీ లాంటి నటుడితో స్క్రీన్ షేర్ చేసుకోవడం మాత్రం ఏ హీరోకయినా ఒక తీపి గుర్తే.