ఇప్పుడున్న సినిమాలన్నీ కథల పరంగా కొత్తగా అనిపించకపోయినా.. కథ అండ్ కథనంలో కొత్తదనం చూపిస్తానంటూ ఎప్పుడూ ముందే ఉంటాడు దర్శకుడు విక్రమ్ కె కుమార్. మనోడికి నంది అవార్డులు వచ్చినా రాకపోయినా.. తన స్టాండర్డ్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుందని చూపిస్తాడు. అదిగో ఇప్పుడు అఖిల్ హీరోగా రూపొందిస్తున్న ''హలో'' సినిమాతో అదే చెబుతున్నాడు.
ఒక్కసారి చిన్నతనంలో కలసిన మనసులు విడిపోవని.. అవి ఎప్పటికైనా తమ సోల్ మేట్ ను వెతుక్కుంటాయంటూ.. నాగార్జున వాయిస్ ఓవర్ తో కూడుకున్న అఖిల్ టీజర్.. యాక్షన్ సీక్వెన్సులతో అదిరిపోయింది. అఖిల్ అండ్ కొత్తపిల్ల కళ్యాణి సినిమాలో కొత్తగానే ఉన్నారు. అయితే ఇక్కడ అన్నింటికంటే కొత్తగా ఉంది మాత్రం..యాక్షన్ కంటెంట్. బిల్డింగ్స్ మీద నుండి దూకడం.. బైక్ చేజులూ.. జంపులూ.. ఇవన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ రోడ్లపై ఆ ఛేజులన్నీ అసలు మనం చూస్తోంది హైదరాబాద్ నేనా అనే తరహాలో ఉన్నాయి. బహుశా హాలీవుడ్ యాక్షన్ కొరియాగ్రాఫర్ ఉంటే దాని స్టయిల్ ఇలాగే ఉంటుంది కాబోలు.
అయితే ఇలాంటి సింపుల్ స్టోరీని ఖచ్చితంగా సింపుల్ గా మాత్రం నెరేట్ చేయడు మన విక్రమ్ కుమార్ అంటున్నారు సినిమా లవ్వ్రర్స్. నాగార్జున్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమాకు పిఎస్ వినోద్ అందించిన విజువల్స్ అద్భుతహా అనే చెప్పాలి.
Full View