దేవరకొండ కింగ్‌డమ్.. పార్ట్ 2 ఉంది కానీ..

విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో పాన్ ఇండియా మాస్ ఎంటర్టైనర్‌గా వస్తున్న చిత్రం కింగ్‌డమ్. ఈ సినిమా గురించి మొదటి అనౌన్స్‌మెంట్ నుంచే హైప్ కొనసాగుతోంది.;

Update: 2025-03-20 17:54 GMT

విజయ్ దేవరకొండ కెరీర్‌లో మరో పాన్ ఇండియా మాస్ ఎంటర్టైనర్‌గా వస్తున్న చిత్రం కింగ్‌డమ్. ఈ సినిమా గురించి మొదటి అనౌన్స్‌మెంట్ నుంచే హైప్ కొనసాగుతోంది. ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం, విజయ్ దేవరకొండ అభిమానులను ఎప్పటి నుంచో ఉత్కంఠలో పడేసింది. స్టార్ హీరోకు సరిపోయే స్థాయిలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రం, రీసెంట్‌గా మరో ఇంట్రెస్టింగ్ అప్‌డేట్‌ను అందుకుంది.

ఇప్పటివరకు ఈ సినిమాను స్ట్రాంగ్ స్టోరీ లైన్ ఉన్న మూవీగా మాత్రమే చూశారు. కానీ ఇప్పుడు ఇది రెండు పార్ట్‌లుగా తెరకెక్కనున్నట్లు అధికారికంగా బయటకొచ్చింది. సినిమా షూటింగ్ దశలోనే ఉన్నప్పటికీ, మేకర్స్ ప్రమోషన్స్‌కి మోడ్రన్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. ఇటీవలే మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాత నాగవంశీ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సినిమా హై బడ్జెట్‌లో రూపొందుతుండటంతో పాటు, యాక్షన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిపి విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీల్లో ఒకటిగా నిలవబోతోందని తెలిపారు. ఈ సినిమా మే 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నాగవంశీ మాట్లాడుతూ, “కింగ్‌డమ్ కథ రెండు పార్ట్‌లుగా నాకు చెప్పబడింది. స్టోరీని బలవంతంగా లెంగ్త్ పెంచి సీక్వెల్ చేయడం లేదు. గౌతమ్ మొదటి భాగం చెప్పినప్పుడు, రెండో పార్ట్‌కు వేరే స్క్రీన్‌ప్లే ఉంటుందని చెప్పాడు.

అయితే, రెండో భాగానికి టైటిల్ ఇంకా ఖరారు కాలేదు. మొదటి పార్ట్ విజయాన్ని బట్టి సీక్వెల్ తీసే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకునేలా అన్ని మేజర్ టిక్ బాక్స్‌లను పూర్తి చేస్తుందని నమ్మకంగా చెబుతాను” అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందించగా, సితార ఎంటర్టైన్మెంట్స్ భారీగా నిర్మిస్తోంది. విజువల్స్ పరంగా, సాంకేతికంగా కింగ్‌డమ్ కొత్త లెవెల్‌లో ఉంటుందని టాక్.

యాక్షన్ ఎపిసోడ్స్ మాస్ ప్రేక్షకులను థ్రిల్ చేసేలా ఉంటాయని సమాచారం. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఇదివరకు చూడని యాక్షన్ మోడ్‌ను ఇందులో చూపించబోతున్నారని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. ఇప్పటి వరకు విడుదలైన పోస్టర్లు, వీడియో గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. మే 30న గ్రాండ్ రిలీజ్ కోసం సన్నాహాలు జరుగుతుండగా, మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా హాట్ టాపిక్‌గా మారింది. కింగ్‌డమ్ విజయం సాధిస్తే, రెండో భాగం మరింత భారీ స్థాయిలో తెరకెక్కించే అవకాశం ఉంది. మరి, విజయ్ దేవరకొండ ఈ సినిమా ద్వారా బ్లాక్‌బస్టర్ అందుకుంటాడో లేదో చూడాలి.

Tags:    

Similar News