ఓవర్సీస్ లో తెలుగు సినిమాలకి లియో దెబ్బ!
ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ లియో. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది
ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ లియో. పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే తమిళ్, తెలుగు భాషలలో సినిమాకి ఎక్కువ హైప్ ఉంది. లోకేష్ కనగరాజ్ బ్రాండ్ కారణంగా తెలుగు ఆడియన్స్ కూడా లియో చిత్రంపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఇక్కడే అసలు సమస్య వస్తోంది.
లోకేష్ బ్రాండ్, దళపతి విజయ్ ఇమేజ్ తెలుగులో కొంత ప్రభావం చూపిస్తోంది. తెలుగు రాష్ట్రాలలో ఈ ఇంపాక్ట్ పెద్దగా కనిపించడం లేదు కాని ఓవర్సీస్ మార్కెట్ లో మాత్రం లియో మూవీ ప్రభావం భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావుపై కచ్చితంగా ఉందని చెప్పొచ్చు. ఓవర్సీస్ లో హీరోల ఇమేజ్, బ్రాండ్ కూడా అబ్జర్వ్ చేస్తారు.
బాలయ్య రవితేజ, విజయ్ చిత్రాలో ఫస్ట్ ఛాయస్ బాలయ్యకి ఉన్న సెకండ్ ఛాయస్ గా మాత్రం విజయ్ వైపు చూస్తున్నారు. ఇప్పటి వరకు ఓవర్సీస్ లో లియో సినిమా తెలుగు వెర్షన్ కి 100 కె బుకింగ్స్ జరిగాయి. భగవంత్ కేసరి 165 కె బుకింగ్స్ మాత్రమే జరిగాయి. ఈ రెండింటి తర్వాత టైగర్ నాగేశ్వరరావు ఉండటం విశేషం. దీనిని బట్టి తెలుగు సినిమాలని లియో తెలుగు వెర్షన్ కొంత వరకు డామినేట్ చేస్తోందని స్పష్టం అవుతోంది.
అయితే ఈ ప్రభావం తెలుగు రాష్ట్రాలలో ఉండే అవకాశం లేదనే మాట సినీ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. మొదటి ప్రాధాన్యత భగవంత్ కేసరి ఉంటుంది. అదే రోజు లియో రిలీజ్ కాబోతోంది కాబట్టి కొంత బజ్ ఉంటుంది. అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ కాబోతోంది. ఫస్ట్ డే రెండు సినిమాల టాక్ ఏంటి అనేది ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోతుంది.
దీనిని బట్టి టైగర్ నాగేశ్వరరావు రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే థియేటర్స్ సంఖ్య క్రమంగా పెరుగుతాయి. అలాగే ఆడియన్స్ రెస్పాన్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. మరి ఈ దసరా రేసులోఉన్న ఈ మూడు చిత్రాలలో ఏది పబ్లిక్ ని ఎట్రాక్ట్ చేస్తుందనేది చూడాలి.