లియో బాక్సాఫీస్.. ఇది కాంబో బీభత్సం

ప్రతిసారి విజయ్ సినిమాలు అంతకు మించి అనేలా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపిస్తున్నాయి. ఇక ఈసారి విక్రమ్ దర్శకుడు లోకేష్ అతనితో కలవడం బాగా కలిసి వచ్చింది

Update: 2023-10-20 07:59 GMT

విజయ్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో వచ్చిన లియో సినిమా మొదటిరోజు బాక్సాఫీస్ వద్ద ఊహించినట్టుగానే వంద కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని ఒక సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. టాక్ ఎలా ఉన్నా విజయ్ పాన్ ఇండియా రేంజ్ లో ప్రభావం చూపకపోయినప్పటికీ సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక స్థాయిలో ఓపెనింగ్ రాబట్టడం విశేషం. అతనికి తమిళంలోనే కాకుండా తెలుగులోనూ అలాగే కన్నడలో మంచి మార్కెట్ ఉంది.

ప్రతిసారి విజయ్ సినిమాలు అంతకు మించి అనేలా బాక్సాఫీస్ వద్ద ప్రభావం చూపిస్తున్నాయి. ఇక ఈసారి విక్రమ్ దర్శకుడు లోకేష్ అతనితో కలవడం బాగా కలిసి వచ్చింది. ఈ కాంబినేషన్ రేంజ్ కు తగ్గట్టుగానే బాక్సాఫీస్ వద్ద నెవర్ బిఫోర్ అనేలా ఓపెనింగ్స్ అందుకుంది. ఇక ఏ ఏరియాలో ఈ సినిమా ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే..

మొదట తమిళనాడులోని 27 కోట్లకు పైగా కలెక్షన్స్ రావడం ఒక రికార్డు అనే చెప్పాలి. అక్కడ పూర్తిస్థాయిలో సినిమా డామినేట్ చేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో విజయ్ కు మరోసారి బెస్ట్ ఓపెనింగ్స్ వచ్చాయి తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజే ఈ సినిమా 13 కోట్ల పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఇక కర్ణాటకలో 11.26 కోట్లు, కేరళలో 10.49 కోట్లు రాబట్టింది.

రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి 2.71 కోట్లు రాగా ఓవర్సీస్ లో విజయ్ మరోసారి తన స్టార్ ఇమేజె తో 50 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడ్డాడు. ఈ సినిమాకు మొదట కొత్త నెగిటివ్ టాక్ వచ్చినప్పటికీ మొదటిరోజు ఆ ప్రభావం కలెక్షన్స్ పై ఎంత మాత్రం పడలేదు. ఇక మొత్తంగా మొదటి రోజు లియో సినిమా 115 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టింది.

తమిళ హీరోకు ఇది ఒక బెస్ట్ రికార్డు అని చెప్పవచ్చు. ఇక కోలీవుడ్ నుంచి వచ్చిన సినిమాల్లో అత్యధిక ఓపెనింగ్స్ అందుకున్న సినిమాల్లో కూడా ఇది ఒకటిగా నిలిచింది. ఇప్పటికే సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమాతో 105 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకోగా ఆ తర్వాత 2.0 సినిమా 117 కోట్ల కలెక్షన్స్ తో టాప్ లో కొనసాగుతోంది. ఇక ఈసారి విజయ్ ఆ రికార్డులలో కబాలి రికార్డును బ్రేక్ చేసి నెంబర్ 1 స్థానంలో నిలిచాడు. మరి ఈ సినిమా రెండవ రోజు ఎలాంటి కలెక్షన్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News