బిగ్ బాస్ 8 : విన్నర్ అవ్వాల్సిన కంటెస్టెంట్.. కానీ..?
బిగ్ బాస్ సీజన్ 8 లో జరిగిన వీకెండ్ ఎపిసోడ్ బిగ్ బాస్ ఆడియన్స్ కు మరోసారి షాక్ ఇచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 8 లో జరిగిన వీకెండ్ ఎపిసోడ్ బిగ్ బాస్ ఆడియన్స్ కు మరోసారి షాక్ ఇచ్చింది. వీకెండ్ లో డబల్ ఎలిమినేషన్ అని చెప్పి శనివారం రోహిణిని, ఆదివారం విష్ణు ప్రియని ఎలిమినేట్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 ఫైనలిస్ట్ లు ఉన్నారు. ఆల్రెడీ రెండు వారాల క్రితమే అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి టాప్ 5 లో మొదటి కంటెస్టెంట్ గా చేరాడు. ఇక ఆదివారం ఎపిసోడ్ లో సెకండ్ ఫైనలిస్ట్ గా నిఖిల్, థర్డ్ ఫైనలిస్ట్ గా గౌతం, ఫోర్త్ ప్రేరణని అనౌన్స్ చేశారు.
ఇక నబీల్, విష్ణు ప్రియలలో విష్ణు ప్రియని ఎలిమినేట్ చేసి నబీల్ ని ఫిఫ్త్ ఫైనలిస్ట్ గా అనౌన్స్ చేశారు. ఐతే తన ఎలిమినేషన్ ను ముందే ఊహించుకున్న విష్ణు ప్రియ పెద్దగా షాక్ అవ్వలేదు. ఐతే బిగ్ బాస్ సీజన్ 8 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వచ్చిన విష్ణు ప్రియ తన ఆట పక్కన పెట్టి పృధ్వి మీద ఎక్కువ ఫోకస్ చేయడమే ఆమె ఫైనల్ వీక్ కి దూరమైందని చెప్పొచ్చు.
పృధ్వి అంటే ఇష్టం ఉండి.. అతనితో కలిసి ఉన్నా టాస్కులు చేస్తున్నప్పుడు అయినా తన ఫోకస్ మారిస్తే బాగుండేది కానీ.. అమ్మడు అలా కాకుండా పృధ్వి పృధ్వి అంటూ అతని వెంటే తిరిగింది. ఐతే విష్ణు ప్రియ అలా చేయడం వల్ల పృధ్వికి మంచి మైలేజ్ వచ్చింది. అతను కూడా ఎంత జెన్యూన్ అన్నది ఆడియన్స్ కు తెలిసింది. ఐతే అతనిలో ఉన్న కోపంలో అతన్ని లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యేలా చేసింది. ఐతే విష్ణు ప్రియ మొదటి రెండు వారాలు ఆడినట్టుగా సోలోగా టాస్కులు ఆడితే ఆమెకు ఉన్న సోషల్ మీడియా ఫాలోయింగ్ కి ఆమె విన్నర్ అయ్యేది లేదా కనీసం రన్నర్ అయినా అయ్యేది.
కానీ కేవలం పృధ్వి ని కలవరిస్తూ అతనితోనే ఉంటూ ఉండటం వల్ల విష్ణు ప్రియ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. దాని వల్ల ఆమె కనీసం టాప్ 5 లో కూడా ఛాన్స్ దక్కించుకోలేదు. నిఖిల్, గౌతం, ప్రేరణ, అవినాష్ అంటే ఆడియన్స్ కు ఇదివరకు తెలుసు. కానీ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ గా ఎవరికి తెలియకుండా వచ్చిన నబీల్ ని కూడా ఆమె దాటలేకపోయింది అంటే అది ఆమె చేసిన మిస్టేక్ అని చెప్పొచ్చు.