పుష్ప 2 సిక్సర్ కొట్టేసింది: వివేక్ ఆత్రేయ

ఈ వేడుకకు సినీ ప్రముఖులు, మైత్రి మూవీ మేకర్స్‌తో పని చేస్తున్న మరికొందరు దర్శకులు హాజరయ్యారు.

Update: 2024-12-02 17:19 GMT

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో రాబోతున్న పుష్ప సీక్వెల్ పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ కూడా జోరుగా కొనసాగుతున్నాయి. నేడు హైదరాబాద్‌లో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ వేడుకకు సినీ ప్రముఖులు, మైత్రి మూవీ మేకర్స్‌తో పని చేస్తున్న మరికొందరు దర్శకులు హాజరయ్యారు.

వీరి అనుభవాలు, సినిమా గురించి మాట్లాడిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సరిపోదా శనివారం దర్శకుడు వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ, "నేను ఇటీవల అల్లు అర్జున్ గారితో ఒక యాడ్ చేశాను. ఆయన డెడికేషన్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో దగ్గరుండి చూసాను. డైరెక్టర్ ఫేస్ లో చిన్న డిసాటిస్ఫాక్షన్ ఉన్నా కూడా ఆయన ఒప్పుకోరు. ఇక పుష్ప విషయంలో ఆయన ఎంత కష్టపడ్డారు అనేది అర్థమవుతోంది. నాకు అప్పుడే అనిపించింది, ఈ సినిమా సిక్సర్ అవుతుందని.

డిసెంబర్ 5న బాల్ ఎక్కడ పడిందో చూడటం తప్ప, సినిమా కంటెంట్ స్టేడియం అవతలి వైపుకు తీసుకెళ్లడం ఖాయం. ఈ సినిమాకు ఆల్ ది బెస్ట్ చెప్పడం కాదు. ముందే సక్సెస్ అయినట్లు అనిపిస్తోంది. తప్పకుండా సినిమా గ్రాండ్ సక్సెస్ అవ్వడం పక్కా. ఇక చిత్రయూనిట్ సభ్యులకు ముందుగానే అభినందనలు తెలియజేస్తున్నాను," అని తెలిపారు.

మజిలీ దర్శకుడు శివ నిర్వాణ మాట్లాడుతూ, "ఐకాన్ స్టార్ అభిమానులందరికీ నమస్కారాలు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు, పుష్ప 2 సినిమా కోసం ఎదురుచూస్తున్నవారికి ప్రత్యేకంగా నా నమస్కారం. పుష్ప 1 తర్వాత ఈ స్థాయిలో పుష్ప 2 అంచనాలు క్రియేట్ చేయడానికి చిత్రయూనిట్ ఎంతగానో కష్టపడింది. ముఖ్యంగా సుకుమార్ గారు చాలా హార్డ్‌వర్క్ చేశారు. ఆయన నా ఫేవరేట్ దర్శకుడు.

అల్లు అర్జున్ గారు పుష్ప అనే బ్రాండ్‌ను నేషనల్ వైడ్‌గా తీసుకెళ్లి నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆయనకు కూడా నా నమస్కారాలు. పుష్ప 2 తెలుగు సినిమా ఖ్యాతిని మరింత పెంచుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. టెక్నీషియన్స్, రష్మిక, శ్రీలీల, సుకుమార్ గారికి నా బెస్ట్ విషెస్. ఈ సినిమా వరల్డ్ వైడ్ హవా చూపిస్తుంది," అని స్పష్టం చేశారు. అలాగే వేడుకలో "తగ్గేదే లే" అనే డైలాగ్‌ తో తన అభినందనలను తెలిపిన శివ నిర్వాణ, తెలుగు సినిమా భవిష్యత్తుపై విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.

Tags:    

Similar News