మ‌హేష్ బాబు ఎవ‌రి కోసం అలా?

పాన్ ఇండియాలో ఎంత మంది స్టార్లు ఉన్నా..ఆ క్రేజీ ఫాలోయింగ్ మ‌హేష్ కి మాత్ర‌మే సాధ్య‌మైంది.

Update: 2023-10-21 12:11 GMT

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బ్యూటీ గురించి చెప్పేదేముంది. గాళ్స్ లో హ్యాండ్ స‌మ్ అండ్ క్రేజీగా హీరోగా? ఖ్యాతికెక్కిన ఒకే ఒక్క స్టార్ అత‌ను. మ‌హేష్ లో ఆ బ్యూటీనే రోజూ ల‌క్ష‌ల్లో ప్రపోజ‌ల్స్ తీసుకొస్తున్నాయి. అత‌న్ని అభిమానించ‌ని అమ్మాయి ఉంటుందా? మ‌హేష్ బ్యూటీకి ఫిదాకాని లేడీ ఫ్యాన్స్ ఉంటుందా? అత‌ను స్టార్ కాక‌పోయినా? అత‌ని రేంజ్ అంతేన‌న‌డంలోనూ ఎలాంటి అతిశ‌యోక్తి లేదు.


పాన్ ఇండియాలో ఎంత మంది స్టార్లు ఉన్నా..ఆ క్రేజీ ఫాలోయింగ్ మ‌హేష్ కి మాత్ర‌మే సాధ్య‌మైంది. తాజాగా మ‌హేష్ న్యూలుక్ చూస్తే మాత్రం స్ట‌న్ అవ్వాల్నిందే. అలాంటి లుక్ లో మ‌హేష్ ట్రాన్స‌ప‌ర్మేష‌న్ ఆద్యంతం షాక్ ఇస్తుంది. అవును మ‌హేష్ న్యూ మేకోవ‌ర్ స్టిల్ ఒక‌టి ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఇదిగో ఇక్క‌డిలా న్యూ డిజైన‌ర్ దుస్తుల్లో గాళ్స్ ని ఫిదా చేస్తున్నాడు. లైట్ బ్రౌన్ క‌ల‌ర్ దుస్తుల్లో క్యూట్ లుక్ వావా్ అనిపిస్తున్నాడు.

మ‌హేష్ కెమెరాకిచ్చిన ఫోజు స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా ఫోక‌స్ అవుతుంది. ఇంత‌వర‌కూ మ‌హేష్ ఎక్కువ‌గా స్టాండింగ్ పొజిష‌న్ల‌లోనే మ్యాగ‌జైన్ల‌కు ఫోజులిచ్చారు .తొలిసారి హెలో మ్యాగ‌జైన్ కోసం ఇలా కొత్త‌గా ట్రై చేసారు. రెండు రోజుల క్రితం ఈ ఫోటో షూట్ నిర్వ‌హించారు. ఇంత‌లోనే ఫోటోలు నెట్టింట లీక్ అయ్యాయి. ప్ర‌స్తుతం ఈ పిక్ నెట్టింట వైర‌ల్ గా మారింది. మ‌హేష్ లేడీ ఫాలోవ‌ర్స్ మిల్క్ బోయ్ ని చూసి మురిసిపోతున్నారు.

ప్ర‌స్తుతం మ‌హేష్ క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `గుంటూరు కారం`లో న‌టిస్తోన్న‌ సంగ‌తి తెలిసిందే. సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉంది. అన్ని ప‌నులు పూర్తిచేసి సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. అనంతరం మ‌హేష్ పాన్ ఇండియా చిత్రం రాజ‌మౌళి సినిమా షూట్ లో పాల్గొంటారు. ఇప్ప‌టికే ఆ సినిమాకి సంబంధించి మ‌హేష్ వ‌ర్కౌట్లు కూడా మొద‌లు పెట్టారు.

Tags:    

Similar News