ఆంటీ అని పిలిస్తే అవమానకరమా? నిలదీసిన నటి!
అయితే ఈసారి ఆమె 'ఆంటీ' ట్యాగ్‌ని సునాయాసంగా అంగీకరించడం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
ఆంటీ అని పిలవడం తప్పా? అవమానకరమా? ఆ పదానికి ఎందుకు నెగెటివిటీని ఆపాదించారు? దీనికి సమాధానం వెటరన్ స్టార్ జీనత్ అమన్ ని అడగాలి. బాలీవుడ్ లో ఐకన్ గా ఏలిన లెజెండరీ నటి జీనత్ దీనికి ఇచ్చిన వివరణ అద్భుతం. జీనత్ నిరంతరం సోషల్ మీడియాను వ్యక్తిగత బ్లాగ్‌గా ఉపయోగించడంలో పాపులరయ్యారు. తన ఆలోచనలు, అభిప్రాయాలు తరచుగా విస్మయానికి గురిచేస్తాయి. అయితే ఈసారి ఆమె `ఆంటీ` ట్యాగ్‌ని సునాయాసంగా అంగీకరించడం ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది.
`ఆంటీ` అనేది అవమానకరమైన పదం అని ఏ మేధావి నిర్ణయించారు? ఇది కచ్చితంగా నేను అయితే కాదు! అని జీనత్ తన ఇన్‌స్టాగ్రామ్ లో రాసారు.. అందంగా ఆలోచింపజేసే క్యాప్షన్‌తో కనిపించింది. జీనత్ తెల్లటి టీషర్ట్ పై ఛాతీ మీదుగా `ఆంటీ` అని రాసి ఉంది. జీనత్ అమన్ గర్వంతో ఆంటీ ట్యాగ్‌ని ధరించింది. ఇది అవమానకరమైన పదం అనే భావనను తొలగించే ప్రయత్నం చేసింది. ఆంటీకి నిర్వచనాన్ని పూర్తిగా మార్చింది.
మన జీవితాలను సౌకర్యవంతంగా ఉండేలా చేసే సర్వవ్యాప్త వృద్ధ మహిళలు లేకుండా ఎక్కడా ఉండలేమని జీనత్ అన్నారు. ఆమెను `ఆంటీ` అని పిలవాలని అన్నారు. వాస్తవానికి ఈ ట్యాగ్ ధరించడం చాలా గర్వంగా ఉంది. `ఆంటీ` అనే పదాన్ని విన్నప్పుడు చిలిపితనం కనిపిస్తుంది. జీవితంలోని వృద్ధ మహిళల గురించి మీరు నిజంగా ఆలోచించారంటే ఆంటీ అన్న ట్యాగ్ వల్లనే అని కూడా అన్నారు. నేను హ్యాపీగా నా స్లీవ్‌పై లేదా నా ఛాతీకి అడ్డంగా వేసుకునే ట్యాగ్ ఇది అని అన్నారు. జీనత్ అమన్ NBNW నుండి ఆంటీ లాంగ్ స్లీవ్ టీషర్ట్‌ని ధరించింది. తెల్ల చొక్కా 100 శాతం కాటన్‌తో తయారు చేసారు. రిటైల్ వెబ్‌సైట్‌లో దీని ఖరీదు రూ. 4,400.