దేవర : ఆయన 30 నిద్ర లేని రాత్రులు
ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమా విడుదలకు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది.
ఎన్టీఆర్ హీరోగా నటించిన 'దేవర' సినిమా విడుదలకు వారం రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. కొన్ని సినిమాలు రేపు విడుదల అనే వరకు ఏదో పని చేస్తూనే ఉంటారు. కానీ దేవర సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం వారం ముందే పూర్తి అయిందట. తాజాగా డీఓపీ రత్నవేలు చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. సినిమాను పూర్తి చేయడం కోసం 30 నిద్ర లేని రాత్రులను గడిపినట్టుగా ఆయన పేర్కొన్నాడు. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా కలర్ గ్రేడింగ్, వీఎఫ్‌ఎక్స్ షాట్స్ మిక్సింగ్, ఐమాక్స్ వర్షన్ లను రెడీ చేయడం కోసం రత్నవేలు చాలా కష్టపడ్డడని తెలుస్తోంది.
డీఓపీ రత్నవేల్ ట్విట్టర్ లో.... దేవర కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్ వీఎఫ్‌ఎక్స్ షాట్స్ కోసం 30 నిద్రలేని రాత్రులు గడిపాము. ఐమాక్స్, ప్రీమియర్ లార్జ్ ఫార్మట్, డి - బాక్స్, 4డి ఎక్స్, ఓవర్సీస్ 2.35 ఎంఎం కంటెంట్ ఇలా అన్ని రకాల ప్రింట్ ను సకాలంలో డెలివరీ చేయడం సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ ముందుకు దేవర రాబోతుంది. ప్రతి ఒక్కరు సినిమాను ఆస్వాదిస్తారని నమ్ముతున్నాను అంటూ ట్వీట్ చేశాడు. సోషల్ మీడియాలో ఎన్టీఆర్ తో ఉన్న ఫోటోను షేర్ చేయడంతో పాటు ఆన్ లొకేషన్ స్టిల్ నూ డీఓపీ రత్నవేలు షేర్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు.
మరో వైపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి పుకార్లు పెద్ద ఎత్తున షికార్లు చేస్తున్నాయి. రేపు జరగబోతున్న ఈవెంట్ లో టాలీవుడ్ జక్కన్న రాజమౌళి, త్రివిక్రమ్, కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ లు పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ఈ ముగ్గురితో ఎన్టీఆర్ కి ఉన్న సన్నిహిత సంబంధాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ఈ ముగ్గురూ ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొనబోతున్నారు అనే టాక్ వినిపిస్తోంది. వీరితో పాటు సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. గెస్ట్ ల వివరాలు నేడు సాయంత్రంకు క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఆర్ఆర్‌ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ చేసిన సినిమా ఇదే అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాను రూపొందించడం జరిగింది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించడంతో పాటు, బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ కు కిచ్ ఇచ్చే విధంగా ఎన్టీఆర్ ను డ్యుయెల్ రోల్ లో దర్శకుడు చూపించబోతున్నాడు. ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న దేవర సినిమా అడ్వాన్స్ బుకింగ్ మరో రెండు రోజుల్లో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే యూఎస్ లో అడ్వాన్స్ బుకింగ్ షురూ అయింది.