కిరణ్ అబ్బవారం.. మళ్ళీ అదే తప్పు చేయకుంటే బెటర్..
దీని తర్వాత కిరణ్ అబ్బవరం భవిష్యత్తు సినిమాలపై ప్రేక్షకులకి ఆసక్తి పెరిగింది.
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ‘క’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాతో అతని మార్కెట్ కూడా మళ్ళీ గాడిలో పడింది. అంచనాలకి మించి ఈ చిత్రం కలెక్షన్స్ వస్తూ ఉండటం విశేషం. కిరణ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా ఈ మూవీ నిలుస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. దీని తర్వాత కిరణ్ అబ్బవరం భవిష్యత్తు సినిమాలపై ప్రేక్షకులకి ఆసక్తి పెరిగింది. ఇదిలా ఉంటే ‘క’ సక్సెస్ తో జోష్ లో ఉన్న కిరణ్ అబ్బవరం మరో సినిమాని రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
‘క’ కంటే ముందుగా కిరణ్ విశ్వ కరుణ్ దర్శకత్వంలో ‘దిల్ రుబా’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కూడా కంప్లీట్ అయిపొయింది. రుక్సార్ థిల్లాన్ ఈ చిత్రంలో కిరణ్ కి జోడీగా నటించింది. లవ్ స్టోరీతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రిలీజ్ చేయకుండా హోల్డ్ లో పెట్టారు. ‘క’ మూవీ రిలీజ్ తర్వాత ‘దిల్ రుబా’ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకి తీసుకొస్తే బాగుంటుందని భావించారు. ‘క’ తో కిరణ్ బ్లాక్ బస్టర్ కొట్టడంతో ఇప్పుడు ఆ క్రేజ్ ‘దిల్ రుబా’కి ప్లస్ అవుతుందని భావిస్తున్నారు.
త్వరలో ఈ మూవీ రిలీజ్ కన్ఫర్మ్ చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో కిరణ్ అబ్బవరం లవర్ బాయ్ గా కనిపించబోతున్నాడంట. ఈ సినిమాకి మంచి బిజినెస్ జరిగే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే గతంలో కిరణ్ అబ్బవరం గ్యాప్ లేకుండా ఏడాదికి రెండు సినిమాల చొప్పున ప్రేక్షకుల ముందుకి తీసుకొని వచ్చేవాడు. ఈ బ్యాక్ టూ బ్యాక్ మూవీస్ కారణంగా కిరణ్ కి ఫ్లాప్ లు ఎక్కువగా వచ్చాయి.
‘క’ తర్వాత స్లో అండ్ స్టడీగా కిరణ్ అబ్బవరం కెరియర్ బిల్డ్ చేసుకుంటాడని అందరూ అనుకున్నారు. అయితే అనూహ్యంగా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా ‘దిల్ రుబా’ని రిలీజ్ చేయబోతున్నాడు. ఈ చిత్రం తర్వాత మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ కి కొంత గ్యాప్ తీసుకొచ్చని అనుకుంటున్నారు. గతంలో కిరణ్ అబ్బవరం గ్యాప్ తీసుకోకుండా వరుసగా సినిమాలు చేయడం వలన ఎక్కువ ఫ్లాప్ లు వచ్చాయి. అయితే మరోసారి అలాంటి తప్పు చేయకుండా ఉంటే బెటర్ అనే అభిప్రాయం వినిపిస్తోంది.
చిన్న, మీడియం రేంజ్ హీరోలు మేగ్జిమమ్ కంటెంట్ తోనే ప్రజలని ఎట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. మంచి కంటెంట్ పెర్ఫెక్ట్ ప్లానింగ్ తో వర్క్ అవుట్ చేసి తెరపై ఆవిష్కరిస్తే ‘క’ లాంటి రిజల్ట్ వస్తుంది. అలా కాకుండా కమర్షియల్ హీరోయిజం కోసం ప్రయత్నం చేస్తే దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు. కిరణ్ మరోసారి అలాంటి తప్పు చేయడని, భిన్నమైన కథలతో రావడానికి ప్రయత్నించొచ్చని అనుకుంటున్నారు.