దీపావళి సినిమాలు.. ఇంతకు ఏది పేలింది?
ఆ విధంగానే దీపావళి కానుకగా ఈ ఇయర్ కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
కొన్నాళ్లుగా దీపావళి పండుగను కూడా సినీ మేకర్స్.. ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే. సెలవు ఒక్కరోజే ఉన్నా.. తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. ఆ విధంగానే దీపావళి కానుకగా ఈ ఇయర్ కూడా పలు చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. కిరణ్ అబ్బవరం 'క', దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్, శివ కార్తికేయన్ అమరన్ మూవీస్ తో పాటు మరిన్ని సినిమాలు విడుదలయ్యాయి. మరి ఆ చిత్రాలు ఎలా ఉన్నాయంటే?
రాజాగారు రాణివారు, ఎస్ ఆర్ కళ్యాణమండపం, సమ్మతమే వంటి సినిమాలతో ఇప్పటికే సినీ ప్రియులను అలరించిన టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.. ఇప్పుడు క చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. సుజిత్, సందీప్ దర్శకత్వం వహించిన ఆ సినిమా.. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మంచి కంటెంట్ ఉన్న థ్రిల్లర్ అంటూ రివ్యూస్ వస్తున్నాయి. తన రోల్ కు తగ్గ యాక్టింగ్ తో కిరణ్ అదరగొట్టారని అంతా చెబుతున్నారు.
మాలీవుడ్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన మరో తెలుగు స్ట్రయిట్ మూవీ లక్కీ భాస్కర్.. ఇప్పుడు సినీ ప్రియులను ఓ రేంజ్ లో ఆకట్టుకుంటోంది. విడుదలకు ముందు ప్రేక్షకుల్లో నెలకొల్పిన అంచనాలను అందుకుని దూసుకుపోతోంది. దుల్కర్ యాక్టింగ్ కు ఫిదా అవుతున్నారు. లక్కీ భాస్కర్ కు గాను యంగ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి కథ రాసుకున్న విధానం, రోల్స్ డిజైనింగ్, స్క్రీన్ ప్లే.. అన్ని అదిరిపోయాయని చెబుతున్నారు.
ఆర్మీ దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన అమరన్ మూవీ కూడా నేడే ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ, తెలుగులో రిలీజ్ అయిన ఆ సినిమా సూపర్ హిట్ టాక్ అందుకుని దూసుకెళ్తోంది. ముకుంద రాజన్ గా శివ కార్తికేయన్.. ఆయన సతీమణి భార్య ఇందు పాత్రలో సాయి పల్లవి ఒదిగిపోయారని చెబుతున్నారు. అమరన్ ది ఎమోషనల్ రైడ్ అంటూ సినీ ప్రియులు రివ్యూస్ ఇస్తున్నారు.
ఈ మూడింటితో పాటు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించిన బఘీర మూవీ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చినా అనుకున్న స్థాయిలో మెప్పించలేదని టాక్ వినిపిస్తోంది. మొత్తానికి దివాళీకి వచ్చిన 'క' , లక్కీ భాస్కర్, అమరన్.. మూడు సినిమాలు తెలుగు ఆడియన్స్ ను అలరిస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే.. తెలుగు సినీ ప్రియులు టాలీవుడ్ యంగ్ హీరో మూవీ 'క'కి వెళ్తున్నారు. మాలీవుడ్ స్టార్ హీరో సినిమా లక్కీ భాస్కర్ ను చూస్తున్నారు. కోలీవుడ్ యంగ్ హీరో శివ కార్తికేయన్ అమరన్ చిత్రాన్ని ఆదరిస్తున్నారు. ఏదేమైనా తెలుగు ఆడియన్స్ టేస్టే వేరబ్బా!