12 ఏళ్లగా అదే షాప్...15 ఏళ్ల కులదేవత కోసం అలా!
ఆ ప్లేస్ ఎక్కడ అన్నది తెలియదుగానీ అదే షాప్ లో చాక్లెట్లు..బిస్కెట్లు కొనడం అన్నది యశ్ కి కొత్త కాదు. గత 12 ఏళ్లగా ఆ ప్లేస్ కి వెళ్తే పనిగట్టుకుని అక్కడికే వెళ్లి కొంటాడుట.
పాన్ ఇండియా స్టార్ యశ్ రేంజ్ హీరో అన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వందల కోట్ల రూపాయలు మార్కెట్ ఉన్న హీరో. ఒక్కో సినిమాకి కోట్లలో పారితోషికం తీసుకుంటున్న స్టార్. ఇప్పుడతనితో సినిమాలు చేయాలని ఇండియాలో ఉన్న ప్రతీ డైరెక్టర్ అనుకుంటున్నాడు. అంతకు మించి యశ్ అందగాడని చెప్పాల్సిన పనిలేదు. అమ్మాయిల గుండెల్లో రాకుమారుడు. అతడు కనిపిస్తే సెల్పీ అంటూ మీద పడేవా రెంతో మంది.
మరి అంతటి క్రేజీ హీరో లైఫ్ ని ఎంత సింపుల్ గా లీడ్ చేస్తున్నాడో తెలియాలంటే ఈ ఫోటో గురించి తెలుసుకోవాల్సిందే. అదో రొడ్డుపక్కన షాప్. కనిపించగానే యశ్ వెంటనే అందులోకి దూరిపోయి చాక్లెట్లు..బిస్కెట్లు..ఐస్ క్రీమ్ లు కొనేస్తున్నాడు. ఆయన వెంట భార్య రాధిక పండిట్ కూడా ఉన్నారు. భర్త వాటన్నింటిని కొంటుంటే ఆ పక్కన ఉన్న బల్లపై కూర్చుని ఆమె కులాసాగా ఎంతో కూల్ గా ఐస్ క్రీమ్ తింటుంది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతోనే మరోసారి యశ్ సింప్లిసిటీ బయట పడింది.
ఆ ప్లేస్ ఎక్కడ అన్నది తెలియదుగానీ అదే షాప్ లో చాక్లెట్లు..బిస్కెట్లు కొనడం అన్నది యశ్ కి కొత్త కాదు. గత 12 ఏళ్లగా ఆ ప్లేస్ కి వెళ్తే పనిగట్టుకుని అక్కడికే వెళ్లి కొంటాడుట. ఈసారి పిల్లలు ఆ షాప్ నుంచి ఏవైనా తీసుకురండి అంటే? అక్కడ కావాల్సిన వాటన్నింటిని కొంటున్నాడు. మరి పనిగట్టుకుని అక్కడికే భార్యతో కలిసి ఆషాప్ కే ఎందుకు వెళ్లినట్లు? అంటే అక్కడే భార్య రాధిక కుల దేవత ఉందిట.
ఈ సందర్భంగా ఏటా అక్కడికి వెళ్తుంటారుట. గత 15 ఏళ్లగా భార్య కుల దేవత గా కొలవడంతో ఆమె కోరిక మేరకు యశ్ కుటుంబంతో అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఆ ప్రాంతం ఎక్కడ అన్నది మాత్రం రివీల్ చేయలేదు. మరి ఆ షాపులో పనిచేస్తున్న వారికి యశ్ హీరో అన్న సంగతి తెలిసో తెలియదో. యశ్ మాత్రం రాత్రి సమయంలో ఆ షాపుకి వెళ్లినట్లు కనిపిస్తుంది. ఈ విషయాలన్ని యశ్ రివీల్ చేయడంతోనే బయటకు వచ్చాయి.