గాగ్రా చోళీలో యుక్తి మెరుపులు

కె ర్యాంప్ సినిమా పూజా కార్య‌క్ర‌మానికి యుక్తి ఇలా గాగ్రా చోళీలో మెరిసింది.

Update: 2025-02-04 13:30 GMT

2023లో నాగ శౌర్య హీరోగా వ‌చ్చిన రంగ‌బ‌లి సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హ‌ర్యానా భామ యుక్తి తరేజాకు ఆ సినిమా త‌ర్వాత తెలుగులో మంచి ఆఫ‌ర్లొస్తాయ‌నుకున్నారు. కానీ ఆ సినిమా ఫ్లాప్ అవ‌డంతో అమ్మ‌డికి నిరాశే మిగిలింది. రంగబలి త‌ర్వాత యుక్తి త‌రేజాకి టాలీవుడ్ నుంచి ఎలాంటి ఆఫ‌ర్లు రాకపోవ‌డంతో మ‌ల‌యాళంలో ఓ సినిమా చేసింది.

యుక్తి మ‌ల‌యాళంలో చేసిన మార్కో రీసెంట్ గా రిలీజై మంచి హిట్ అందుకుంది. ఆ సినిమా హిట్ అవ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి యుక్తి పైనే ఉంది. మార్కో హిట్ అవ‌డంతో యుక్తికి కిర‌ణ్ అబ్బ‌వ‌రం తాజా సినిమా కె ర్యాంప్ లో అవ‌కాశ‌మిచ్చారు ద‌ర్శ‌కనిర్మాత‌లు. రాజేష్ దండా నిర్మించ‌నున్న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌తో మొద‌లైంది.

కె ర్యాంప్ సినిమా పూజా కార్య‌క్ర‌మానికి యుక్తి ఇలా గాగ్రా చోళీలో మెరిసింది. సీ బ్లూ క‌ల‌ర్ గాగ్రా ధ‌రించి చేతికి మ్యాచింగ్ బ్రేస్‌లెట్, చెవుల‌కు పెద్ద హ్యాంగింగ్స్ వేసుకుని, లూజ్ గా జ‌డ వేసుకుని మ‌రింత త‌న న‌డుము అందాల‌ను చూపిస్తూ మునుప‌టి కంటే మ‌రింత అందంగా క‌నిపించింది. ఈ గాగ్రాలో యుక్తిని చూసిన వాళ్లంతా ఆమె ఫోటోల‌ను తెగ షేర్ చేస్తున్నారు.

2019లో మోడ‌లింగ్ తో కెరీర్ ను మొద‌టుపెట్టిన యుక్తి త‌ర్వాత ఎన్నో క‌మ‌ర్షియ‌ల్ యాడ్స్ లో న‌టించింది. ఆ టైమ్ లోనే అమ్మ‌డుకి నాగ‌శౌర్య సినిమాలో న‌టించే అవ‌కాశం ద‌క్కింది. ఇమ్రాన్ హ‌ష్మీతో యుక్తి చేసిన లూట్ గ‌యే మ్యూజిక్ ఆల్బ‌మ్ వ‌ల్లే త‌న‌కు సినీ అవ‌కాశాలొచ్చాయి.

Tags:    

Similar News