ఐఫోన్-15 ఫిర్యాదుల వర్షం... రియాక్టైన యాజమాన్యం!

ఐఫోన్‌ 15 సిరీస్‌ లో భాగంగా యాపిల్‌ కంపెనీ సెప్టెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా నాలుగు కొత్త ఫోన్‌ లను విడుదల చేసిన సంగతి తెలిసిందే

Update: 2023-10-02 04:27 GMT

ఐఫోన్‌ 15 సిరీస్‌ లో భాగంగా యాపిల్‌ కంపెనీ సెప్టెంబరు 12న ప్రపంచవ్యాప్తంగా నాలుగు కొత్త ఫోన్‌ లను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో సెప్టెంబరు 22 నుంచి వాటి అమ్మకాలను ప్రారంభించింది. ఆ సమయంలో యాపిల్ స్టోర్స్ ముందు వినియోగదారులు క్యూ కట్టారు. అందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఈ ఫోన్ లు విడుదలైన వారం పదిరోజుల్లోనే ఫిర్యాదులు వెళ్లువెత్తుతున్నాయి.

అవును... ఐఫోన్‌ 15 సిరీస్‌ ఫోన్ల విడుదల సందర్భంగా కంపెనీ ఒక విషయం వెల్లడించింది. ఈ సిరీస్‌ లో పరిచయం చేస్తున్న కొత్త ప్రో మోడల్స్‌ ను ఇంత వరకు విడుదల చేయలేదని వెల్లడించింది. అదేవిధంగా... టైటానియం ఫ్రేం తో ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడళ్లను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో చాలా మంది ఐఫోన్ 15 ప్రో, ప్రో మ్యాక్స్‌ మోడల్స్‌ ను కొనేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే.. ఇప్పుడు వీటికి హీట్ సమస్య మొదలైంది!

ఇందులో భాగంగా... గేములు ఆడుతున్నప్పుడు, వీడియో కాల్స్‌ మాట్లాడుతున్నప్పుడు, వీడియోలు చూస్తున్నప్పుడు, ఇన్ స్టాగ్రాం యూజ్ చేస్తున్నప్పుడు ఫోన్‌ వెనుక భాగం వేడెక్కుతోందని యాపిల్‌ కు వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో యాపిల్ కంపెనీ స్పందించింది... ఈ విషయాన్ని కంపెనీ కూడా ధృవీకరించింది.

అవిరామంగా వస్తోన్న ఫోన్ వేడెక్కుతున్న ఫిర్యాదులపై యాపిల్ యాజమాన్యం స్పందించింది. ఇందులో భాగంగా... కొత్తగా విడుదల చేసిన ఐఓఎస్‌ 17 ఓఎస్‌ లోని బగ్‌ కారణంగానే ఈ మోడల్స్‌ వేడెక్కుతున్నాయని యాపిల్‌ స్పష్టం చేసింది. ఇదే సమయంలో థర్డ్‌ పార్టీ యాప్‌ ల నుంచి వచ్చే అప్‌ డేట్‌ లు కూడా ఫోన్ వేడెక్కడానికి కారణమవుతున్నాయని కంపెనీ అభిప్రాయపడింది.

త్వరలోనే ఈ సమస్యకు పరిష్కారంగా కొత్త ఐఓఎస్‌ 17 అప్‌ డేట్‌ ను విడుదల చేస్తాంమని తెలిపింది. ఇదే సమయంలో చాలా మంది భావిస్తున్నట్లుగా ఫోన్‌ వేడెక్కడానికి, టైటానియం ఫ్రెం కారణం కాదని యాపిల్ కంపెనీ స్పష్టం చేసింది.

Tags:    

Similar News