యాపిల్ కు కొత్త టెన్షన్... వైట్ హౌస్ ఎంట్రీ ఉంటుందా?
ఈ సమయంలో వీలైనంత వేగంగా ఆ బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేపట్టేందుకు ఆ సంస్థ ఇంజినీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు
అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం యాపిల్ కు సరికొత్త సమస్య వచ్చి పడింది. ఆ సంస్థ తన వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2లో వీలైనంత వేగంగా సాఫ్ట్ వేర్ అప్ డేట్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. దీంతో యాపిల్ ఇంజినీర్లు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. కారణం... ఈ వాచ్ లపై ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ (ఐటీసీ) విధించిన నిషేధ ఆదేశాలు ఈ నెల 25 నుంచి అమల్లోకి రానుండటమే!
అవును... వాచ్ సిరీస్ 9, వాచ్ అల్ట్రా 2 లలో బ్లడ్ ఆక్సిజన్ స్థాయిలను కొలిచే ఫీచర్ విషయంలో తమ పేటెంట్ ను యాపిల్ సంస్థ ఉల్లంఘించిందంటూ మాసిమో కార్పొరేషన్ దావా వేసింది. దీంతో ఈ వాచ్ లపై ఇంటర్నేషనల్ ట్రేడ్ కమిషన్ నిషేధ ఆదేశాలు జారీ చేసింది. ఇవి డిసెంబర్ 25 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే సాఫ్ట్ వేర్ ని మరిస్తే ఈ వివాదాన్ని పరిష్కరించుకోవచ్చని యాపిల్ ఆశిస్తోందని తెలుస్తుంది.
ఈ సమయంలో వీలైనంత వేగంగా ఆ బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ సాఫ్ట్ వేర్ లో మార్పులు చేపట్టేందుకు ఆ సంస్థ ఇంజినీర్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు. కారణం... ఒకవేళ యాపిల్ పై నిషేధం తప్పని పక్షంలో ఆ సంస్థ సుమారు 17 బిలియన్ డాలర్ల మేర నష్టం చూడాల్సి వస్తుండటమే అని చెబుతున్నారు!
అయితే... ఈ సమయంలో వైట్ హౌస్ ఈ సమయంలో రంగంలోకి దిగితే నిషేధం ముప్పు తప్పే అవకాశం ఉందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే... ఇది కేవలం సాఫ్ట్ వేర్ సమస్య మాత్రమే కాదని వాదిస్తుంది మాసిమో కార్పొరేషన్ సంస్థ. ఈ రెండు వాచ్ లలోనూ కేవలం సాఫ్ట్ వేర్ మార్పులు చేపడితే సరిపోదని చెబుతుంది.
ఆక్సిజన్ స్థాయిలను కొలిచే హార్డ్ వేర్ విషయంలో కూడా తమకు పేటెంట్ ఉందని గుర్తు చేస్తోంది. ఈ సమయంలో ఒకవేళ హార్డ్ వేర్ లోనూ మార్పులు చేయాల్సి వస్తే యాపిల్ మరో కొత్త తలనొప్పి అనే కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే... హార్డ్ వేర్ మార్పుకు మరో మూడు నెలలు గడువు లభించే అవకాశం ఉన్నప్పటికీ.. అది భారీ ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుందని అంటున్నారు.
ఇదే సమయంలో.. కేవలం ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా, కంపెనీ ప్రతిష్ఠకు సంబంధించిన అంశం అత్యంత ప్రధానం అని అంటున్నారు. దీంతో నిషేధం ముప్పు నుంచి తప్పించుకోవడానికి యాపిల్ తీవ్రంగా శ్రమిస్తోందని తెలుస్తుంది. ఈ సమయంలో ఈ ముప్పు నుంచి తప్పించుకునేందుకు వైట్ హౌస్ హెల్ప్ కోరే అవకాశాలను కొట్టిపారేయలేమని అంటున్నారు.
కాగా... నిషేద ఆదేశాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో... ఇప్పటికే అమెరికాలో ఈ రెండు రకాల వాచ్ ల విక్రయాలను యాపిల్ నిలిపివేసింది. విక్రయాలతోపాటు వాటి ప్రచార, ఆన్ లైన్ విక్రయాలను ఆపేసింది. ప్రస్తుతానికి బ్లడ్ ఆక్సిజన్ ఫీచర్ తో సంబంధం లేని ఎస్‌ఈ శ్రేణి వాచ్ ల విక్రయాలను మాత్రం యథాతథంగా కొనసాగిస్తోంది.