విదేశాల నుంచి ల్యాప్ టాప్ తెప్పిస్తున్నారా... ఒక్కసారి ఇది చదవండి!
విదేశాల నుంచి ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లు వంటి వాటి దిగుమతుల విషయంలో కేంద్రం సరికొత్త ఆంక్షలు విధించింది.
విదేశాల నుంచి ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లు వంటి వాటి దిగుమతుల పై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించింది. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే.. దీనికి కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది.
అవును... విదేశాల నుంచి ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు, పర్సనల్ కంప్యూటర్లు వంటి వాటి దిగుమతుల విషయంలో కేంద్రం సరికొత్త ఆంక్షలు విధించింది. ఇదే సమయంలో కొన్ని మినహాయింపులు కూడా ఇచ్చింది. ఇందులో భాగంగా... సరైన అనుమతులు ఉంటే.. దిగుమతి చేసుకునేందుకు వీలు కల్పించనున్నట్లు తెలిపింది.
ఇందులో భాగంగా ఈ కామర్స్ పోర్టల్స్ లో కొనుగోలు చేసేవారికి మాత్రం మినహాయింపు ఇచ్చింది. ఈ క్రమంలో... "హెచ్.ఎస్.ఎన్ 8741" కింద దిగుమతి చేసుకునే ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్ల పై ఆంక్షలు విధిస్తున్నట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ వెల్లడించింది.
ఇదే సమయంలో ఈ కామర్స్ పోర్టల్స్ లో కొనుగోలు చేసుకునే ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు, కంప్యూటర్లకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు కల్పించినట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంతేగాక, రీసర్చ్ అండ్ డెవలప్మెంట్, బెంచ్ మార్కింగ్, రిపేర్లు కోసం దిగుమతి చేసుకునే వాటికి కూడా ఈ ఆంక్షలు వర్తించబోవని పేర్కొంది.
అయితే.. ఈ కోటాలో దిగుమతి చేసుకునే వాటిని ఎట్టి పరిస్థితుల్లో బయట విక్రయించకూడదని కేంద్రం స్పష్టం చేసింది. ఇలా దిగుమతి చేసుకున్న ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లను పనిపూర్తయిన తర్వాత ధ్వంసం చేయాలని.. లేదా, తిరిగి ఎగుమతి చేయాలని సూచించింది.
అయితే విదేశాలనుంచి ల్యాప్ టాప్ లు, ట్యాబ్ లు తెచ్చుకునే వారి లో బ్యాగేజీ రూల్స్ కింద చేసుకునే దిగుమతులకు ఈ ఆంక్షలు వర్తించబోవని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. లగేజీని కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేసే సమయంలో సరైన ధ్రువపత్రాలు చూపిస్తే వాటిని అనుమతిస్తారని తెలిపింది.