ఒక్క సారి ఛార్జ్‌ చేసే 7 రోజులు... ఫోన్ కం పవర్ బ్యాంక్!

మనకు ఫోన్ లు తెలుసు, పవర్ బ్యాంక్ లు తెలుసు... ఇది రెండూ కలగలిపిన ఫోన్! ఇదే కాదు ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఫోన్ ఇప్పుడు వైరల్ ఇష్యూగా మారింది

Update: 2023-09-30 04:57 GMT

మనకు ఫోన్ లు తెలుసు, పవర్ బ్యాంక్ లు తెలుసు... ఇది రెండూ కలగలిపిన ఫోన్! ఇదే కాదు ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఫోన్ ఇప్పుడు వైరల్ ఇష్యూగా మారింది. ధర కూడా కాస్త అందుబాటులోనే ఉండటంతోపాటు అద్భుతమైన ఫీచర్స్ ని కలిగి ఉంది ఈ ఫోన్ కం పవర్ బ్యాంక్. అసలు ఈ ఫోన్ ఏమిటి.. ఎక్కడ తయారయ్యింది.. దీని ధర ఎంత.. మొదలైన వివరాలు ఇప్పుడు చూద్దాం!

తాజాగా చైనాకు చెందిన టెక్‌ కంపెనీ యులేఫోన్‌ కొత్త స్మార్ట్‌ ఫోన్‌ ను గ్లోబల్‌ గా లాంచ్‌ చేసింది. బిగ్‌ బ్యాటరీతో ఉండే ఈ ఫోన్ ను యులేఫోన్‌ ఆర్మోర్‌ 24 పేరుతో మార్కెట్ లోకి తీసుకొచ్చింది. 22,000 ఎం.ఏ.హెచ్. సామర్థ్యం కలిగిన బిగ్‌ బ్యాటరీ తో వస్తోన్న ఈ ఫోన్ కం పవర్ బ్యాంక్... అవసరం అయినప్పుడు ఎమర్జెన్సీ లైట్‌ సిస్టంలా కూడా పనిచేస్తుంది.

ఆర్మోర్ 24లో 24 జీబీ ర్యాం 256 రోం వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 6.78 అంగులాల ఫుల్ హెచ్‌డీ డిస్ ప్లే కలిగిన ఈ ఫోన్ కు గొరిల్లా గ్లాస్ 5 ని రక్షణగా ఇచ్చారు. ఇక, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేటింగ్‌ తో ఈ ఫోన్ కం పవర్ బ్యాంఖ్ డిస్ ప్లే పనిచేస్తోంది. దీనిలో మీడియా టెక్ హీలియో జీ 96 ప్రాసెసర్ అమర్చారు.

ఇందులో వర్చువల్‌ ర్యాం ను మరో 12జీబీ వరకూ పెంచుకోవచ్చని చెబుతున్నారు. ఇక, ఇందులో రెండు ఐఆర్ ఎల్.ఈ.డీ లు ఉన్నాయి. అదే సమయంలో ఐఆర్ బ్లాస్టర్‌ తో పాటు, ఫోన్ వెనుక ప్యానెల్‌ లో నైట్ విజన్ సపోర్ట్‌ కలిగిఉన్న 64 ఎంపీ కెమెరా, అదేవిధంగా 64 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా అమర్చారు.

సాధారణంగా కొన్ని పవర్ బ్యాంక్స్ కెపాసిటీ 10,000 ఎంఏహెచ్ ఉంటాయనేదీ తెలిసిన విషయమే. అయితే ఈ ఫోన్ బ్యాటరీ కెపాసిటీ 22000 ఎంఏహెచ్ కావడదం గమనార్హం. అందుకే దీన్ని మొబైల్ కాదు పవర్ హౌస్ అని అంటున్నారు. దీనిని ఒకసారి ఫుల్ చార్జీ చేస్తే కనీసం 7 రోజులపాటు పనిచేస్తోందని చెబ్బుతున్నారు.

ఇదే సమయంలో ఐ ఫోన్ 15లో యాక్షన్ బటన్ లాగా ఈ మొబైల్ కు ఒకవైపు బటన్ ఇచ్చారు. అవసరం అయినప్పుడు మొబైల్ ఎమర్జెన్సీ లైట్‌ లా వాడుకోవచ్చు. ఇక మొబైల్‌‌ లో దుమ్ము, నీరు చేరకుండా ఉండేందుకు ఐపీ68 రేటింగ్ కూడా ఇచ్చారు. ఇన్ని ప్రత్యేకతలున్న దీని ధర రూ.34 వేలుగా ఉంది.

Tags:    

Similar News