ఈ టీవీ ధర కోటి.. స్పెషాలిటీ ఏమిటి?

శాంసంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ 110 అంగుళాల మైక్రో ఎల్‌ఈడీ 4కే డిస్‌ ప్లే ను కలిగి ఉంటుంది

Update: 2023-08-05 15:28 GMT

సాధారణంగా సామాన్యులు కొనే టీవీలు వేళల్లో ఉంటాయి. 25 వేల నుంచి 50 వేల లోపు టీవీ కోసం ఖర్చు పెడుతుంటారు. కాస్త ఎగువమధ్య తరగతి వారైతే లక్ష నుంచి లక్షన్నర వరకూ వెళ్లే ఛాన్స్ ఉంది. కానీ తాజాగా ఏకంగా కోటి రూపాయల టీవీ మార్కెట్ లోకి వచ్చింది. దీని ఫీచర్స్ చూస్తే పిచ్చెక్కుతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

అవును... దక్షిణ కొరియా దిగ్గజ సంస్థ శాంసంగ్ సరికొత్త ఎల్‌.ఈ.డీ టీవీని భారత మార్కెట్‌ లో ప్రవేశపెట్టింది. ఈ భూమి మీద దొరికే అత్యంత కఠినమైన పదార్థంతో ఈ టీవీని తయారుచేసిందని చెబుతుంది. తాజాగా 110-అంగుళాల ఈ భారీ మైక్రో ఎల్‌ఈడీ టీవీని భారతీయ ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది.

అన్ని రకాలుగానూ భారీ అయిన ఈ టీవీ స్పెషాలిటీస్ ఏమిటో ఇప్పుడు చూద్దాం...!

శాంసంగ్ మైక్రో ఎల్ఈడీ టీవీ 110 అంగుళాల మైక్రో ఎల్‌ఈడీ 4కే డిస్‌ ప్లే ను కలిగి ఉంటుంది. సఫైర్‌ గ్లాస్‌ తో తయారు చేసిన 24.8 మిలియన్‌ మైక్రో ఎల్‌ఈడీలు ఇందులో అమర్చారు. దీంతో శక్తిమంతమైన రంగులను సైతం కంటికి ఇంపుగా మార్చగలదని కంపెనీ చెబుతోంది.

ఇదే సమయంలో మైక్రో హెచ్డీఆర్‌, మల్టీ ఇంటెలిజెన్స్ ఏఐ అప్‌ స్కేలింగ్, సీన్ అడాప్టివ్ కాంట్రాస్ట్, డైనమిక్ రేంజ్ ఎక్స్‌పాన్షన్ వంటి ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. ఈ శాంసంగ్ మైక్రో ఎల్‌ఈడీ టీవీ భూమిపై రెండో అత్యంత కఠినమైన పదార్థం నీలమణితో తయారు చేశారు.

ఈ టీవీ మైక్రో ఎల్‌ఈడీ టీవీ మల్టీ వ్యూ ఫీచర్‌ నూ అందిస్తుంది. ఈ ఫీచర్ సాయంతో నాలుగు వేర్వేరు సోర్సుల నుంచి కంటెంట్‌ ను వీక్షించవచ్చని శాంసంగ్‌ తెలిపింది. మినిమలిస్టిక్ మోనోలిత్ డిజైన్‌ తో ఈ టీవీ ఉంటుంది. దీని బెజెల్స్ ఇన్‌ విజిబుల్‌ గా ఉంటాయి. అంచులు కూడా చాలా సన్నగా ఉంటాయి.

ఇదే క్రమంలో... మెరుగైన ఆడియో 100డబ్ల్యూ ఆర్.ఎం.ఎస్. సౌండ్‌ సిస్టంను ఇందులో అమర్చారు. ఈ టీవీకి సోలార్‌ సెల్ రిమోట్‌ ఇచ్చారు. దీన్ని ఇండోర్‌ లైట్‌ సాయంతో ఛార్జ్‌ చేయొచ్చని కంపెనీ తెలిపింది. అవును... ఆడియో ఎక్స్‌ పీరియన్స్ కోసం 6.2.2 ఛానెల్ సిస్టం ఉన్న ఆర్.ఎం.ఎస్. సౌండ్ సిస్టం ఉంది.

ఇక దీని మందం 2.49 సెంటీమీటర్లు కాగా.. స్టాండ్ లేకుండా బరువు 87 కేజీలుగా ఉంది. ఈ శాంసంగ్ 110 అంగుళాల మైక్రో ఎల్ఈడీ టీవీ ధర రూ.1,14,99,000గా నిర్ణయించారు. అంటే దాదాపు రూ.1.15 కోట్లు అన్నమాట.

Tags:    

Similar News