షాకింగ్ అధ్యయనం... విడాకులు తీసుకున్న వారి పిల్లలకు స్ట్రోక్ రిస్క్ ఎక్కువ!

ఆ సంగతి అలా ఉంటే... విడాకులు తీసుకున్న పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లలకు స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉందని అంటున్నారు.

Update: 2025-01-26 18:30 GMT

కొంతమంది పిల్లలకు పుట్టుకతోనే గుండె సంబంధిత సమస్యలు ఉంటాయి. అవి.. గుండెలో రంధ్రం, పెద్ద రక్త నాళాల్లో లోపాలు మొదలైనవి! శిశువు జన్యువులో మార్పులు కొన్నిసార్లు ఇలాంటి సమస్యలకు కారణమవుతుంటాయని చెబుతుంటారు. ఆ సంగతి అలా ఉంటే... విడాకులు తీసుకున్న పేరెంట్స్ దగ్గర పెరిగే పిల్లలకు స్ట్రోక్ రిస్క్ ఎక్కువగా ఉందని అంటున్నారు.

అవును... తల్లితండ్రుల విడాకులు పిల్లల జీవితాలపై మానసికంగా, సామాజికంగా ఆ వ్యవహారం ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందనే సంగతి కాసేపు పక్కనపెడితే.. ఆ ప్రభావం వల్ల వారు భవిష్యత్తులో స్ట్రోక్ ప్రమాదాన్ని ఎక్కువగా ఎదుర్కొంటారని చెబుతూ తాజాగా ఓ అధ్యయనం తెరపైకి వచ్చింది. ఇప్పుడు ఈ విషయం షాకింగ్ గా మారింది.

వివరాళ్లోకి వెళ్తే... టొరంటో విశ్వవిద్యాలయానికి చెందిన ఎస్మే ఫుల్లెర్ – థామ్సన్ నేతృత్వంలో ఓ అధ్యయనం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగా.. కుటుంబాలు చెక్కుచెదరకుండా పెరిగిన వారితో పోలిస్తే.. 18 ఏళ్లు నిండకముందే తల్లితండ్రులు విడాకులు తీసుకున్న పిల్లలు స్ట్రోక్ ను ఎదుర్కొనే అవకాశం 60% ఎక్కువగా ఉందని తేలిందని అంటున్నారు.

ఈ అధ్యయనం కోసం 65, అంతకంటే ఎక్కువ వయసుగల 13,000 మంది పెద్దలను పరిశీలించారు శాస్త్రవేత్తలు. ఈ సందర్భంగా స్పందించిన ఫుల్లెర్ - థామ్సన్.. చిన్నతనంలో శారీరకంగా లేదా లైంగికంగా వేధింపులకు గురైన వారిని మినహాయించిన తర్వాత కూడా విడాకులు తీసుకున్న కుటుంబాల్లో పెరిగిన వారికి 60% స్ట్రోక్ వచ్చే అవకాశం ఎక్కువ ఉందని తెలిపారు.

ఇదే సమయంలో... విడాకులు తీసుకున్న ఇంటిలో పెరుగుతున్న పిల్లలకు అధిక రక్తపోటు, నిద్ర సమస్యలు వంటి ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉండవచ్చని.. ఇవన్నీ కలిసి స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతాయని తెలిపారు. తల్లితండ్రుల విడాకులు వారిఒ వారి జీవితాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయనే సంగతి పక్కనపెడితే.. పిల్లలకు అతిపెద్ద సవాలుగా ఉంటుందని అన్నారు.

ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని.. విడాకులు తీసుకునే పరిస్థితుల్లో 18 ఏళ్ల లోపు పిల్లలు ఉన్న తల్లితండ్రులు.. పిల్లలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని.. వారి గురించి కూడా ఆలోచించాలని అంటున్నారు. విడాకుల గాయం యొక్క దీర్ఘకాలిక పరిణామాలను తగ్గించడానికి వారి శ్రేయస్సును రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు.

Tags:    

Similar News