ఏపీలో ముగ్గురు మృతి... జీబీఎస్ పై కీలక అప్ డేట్!
అవును... ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ టెన్షన్ పెడుతోందని అంటున్నారు. ఈ క్రమంలో ఈ సిండ్రోమ్ కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు చెబుతోన్నారు.
ఇటీవల మహారాష్ట్రలోని పూణేలో మొదటి కేసు నమోదైన అనంతరం.. చాపకింద నీరులా వ్యాపించడం మొదలుపెట్టింది గులియన్ బ్యారీ సిండ్రోమ్ (జీబీఎస్). ఆ రాష్ట్రంలో ఇప్పటికే కేసుల సంఖ్య వందల్లోకి చేరుకొందని చెబుతున్నారు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టిస్తోంది. ఇందులో భాగంగా... పెరుగుతున్న మరణాలు, కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది.
అవును... ఆంధ్రప్రదేశ్ లో జీబీఎస్ టెన్షన్ పెడుతోందని అంటున్నారు. ఈ క్రమంలో ఈ సిండ్రోమ్ కారణంగా ముగ్గురు మృతి చెందినట్లు చెబుతోన్నారు. ఇలా మరణాలు, కేసుల సంఖ్య పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మొన్న మహారాష్ట్ర, నిన్న తెలంగాణలో విజృంభించిన ఈ వ్యాధి ఇప్పుడు ఏపీలోనూ మొదలుపెట్టి, చాపకింద నీరులా వ్యాపిస్తోందనే చర్చ మొదలైంది.
ఈ క్రమంలో ప్రస్తుతం గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్ (జీజీహెచ్) లో నలుగురు చికిత్స పొందుతుండగా.. ఈ జీజీహెచ్ లో ఇప్పటివరకూ ఇద్దరు మృతి చెందారు! అంతక ముందు ప్రకాశం జిల్లాకు చెందిన కమలమ్మ (40) గుంటూరు జీజీహెచ్ లోనే చికిత్స పొందుతూ ఆదివారం మరణించారు. ఇలా జీబీఎస్ వల్ల ఏపీలో ఇప్పటివరకూ మూడు మరణాలు సంభవించాయి.
ఈ నేపథ్యంలో... ప్రజలు ఆందోళన చెందవద్దని అధికారులు, వైద్యులు చెబుతున్నారు. ఈ విషయాలపై ఇటీవల స్పందించిన రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్... జీబీఎస్ బాధితులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. వీటికి సంబంధించిన ఇంజెక్షన్లు తీసుకోకుండానే 80 శాతం మంది రికవరీ అయ్యారని వెల్లడించిన సంగతి తెలిసిందే.
కర్నూలులో తొలి జీబీఎస్ కేసు!:
కర్నూలు జిల్లాలో మొదటి జీబీఎస్ కేసు నమోదైంది. జిల్లా కేంద్రంలోని భగత్ సింగ్ నగర్ కు చెందిన గోకారమ్మ (46) అనారోగ్యంతో బాధపడుతుండటంతో కుటుంబసభ్యులు ఆమెను కర్నూలు జనరల్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఈ సమయంలో పరీక్షలు చేసిన వైద్యులు.. ఆమెకు గిలియన్ బారీ సిండ్రోమ్ (జీబీఎస్) గా తేలిందని వెల్లడించారు. ప్రస్తుతం ఆమెను ఎమర్జెన్సీ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు.