షుగర్‌ పేషెంట్లు... తమిళనాట 80 లక్షలు, ఢిల్లీలో 1 వెయ్యి

దేశంలో షుగర్‌ వాధ్యి బారిన పడ్డ వారి లెక్కలను జాతీయ ఆరోగ్య సంస్థ అధికారికంగా వెల్లడించారు.

Update: 2024-12-12 07:30 GMT

ప్రపంచ వ్యాప్తంగా అత్యంత స్పీడ్‌గా విస్తరిస్తున్న జబ్బుల్లో డయాబెటిస్ ఒకటి అంటూ అంతర్జాతీయ స్థాయి ఆరోగ్య సంస్థలు, సర్వేలు చెబుతున్నాయి. ఇండియాలో గడచిన ఇరవై ఏళ్లలో డయాబెటిస్ రోగుల సంఖ్య వందల రెట్లు పెరిగినట్లుగా తెలుస్తోంది. షుగర్‌ బారిన పడుతున్న వారిలో ఎక్కువ శాతం మంది సాధారణ జీవన శైలిని పాటిస్తూ సంతోషంగానే ఉన్నారు. అయితే కొద్ది మంది మాత్రం షుగర్‌ కారణంగా ఇతర తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ తీవ్ర పరిణామాలు చవిచూస్తున్నారు. దేశంలో షుగర్‌ వాధ్యి బారిన పడ్డ వారి లెక్కలను జాతీయ ఆరోగ్య సంస్థ అధికారికంగా వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన జాబితా ప్రకారం డయాబెటిస్‌ వ్యాధితో బాధపడుతున్న వారు అత్యధికంగా తమిళనాడు రాష్ట్రంలో ఉన్నారు. కేంద్రం లెక్కల ప్రకారం తమిళనాడులో ఏకంగా 80 లక్షల 90 వేల మంది ప్రస్తుతం షుగర్‌ వ్యాధితో బాధ పడుతున్నారు. వారిలో అత్యధికులు ఇన్సులిన్‌ వినియోగిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో అత్యధికంగా షుగర్‌ వ్యాధి బారిన పడటంకు కారణం ఏంటి అనే విషయాలపై పరిశోధనలు జరుగుతున్నాయి. త్వరలోనే కేంద్రం ఆ వివరాలను అధికారికంగా వెల్లడి చేసే అవకాశాలు ఉన్నాయి.

తమిళనాడు తర్వాత అత్యధికంగా షుగర్‌ వాధితో బాధపడుతున్న రాష్ట్రాల జాబితాలో రెండో స్థానంలో మహారాష్ట్ర ఉంది. అక్కడ దాదాపుగా 40 లక్షల మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. అక్కడి వారి ఆహారపు అలవాట్లు ఇతర కారణాలను గురించి ప్రత్యేకంగా ఒక బృందం అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడో స్థానంలో కేరళ ఉంది. దాదాపుగా 29 లక్షల మంది ప్రస్తుతం కేరళలో షుగర్‌ వ్యాధితో బాధ పడుతున్నారు. తెలుగు రాష్ట్రాలు ఈ జాబితాలో టాప్‌లో లేకపోవడం కాస్త ఊటరను ఇచ్చే అంశంగా చెప్పుకోవచ్చు.

తెలంగాణ రాష్ట్రం షుగర్‌ అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో నాల్గవ స్థానంలో ఉంది. 24.52 లక్షల మంది షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక ఏపీలో దాదాపుగా 21 లక్షల మంది షుగర్‌ వ్యాధితో ప్రస్తుతం బాధ పడుతున్నారు. దేశంలో అత్యంత తక్కువ షుగర్‌ వ్యాధిగ్రస్తులు ఉన్న రాష్ట్రంగా ఢిల్లీ నిలిచింది. అక్కడ కేవలం 1108 మంది మాత్రమే షుగర్‌ వ్యాధితో ప్రస్తుతం బాధ పడుతున్నారు. అక్కడి ఆహారపు అలవాట్ల కారణంగానే చాలా తక్కువ మంది షుగర్‌ వ్యాధిన పడి ఉంటారు అనేది వైద్యుల అభిప్రాయం. ఈ సంఖ్య భవిష్యత్తులో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. కనుక జీవన శైలి విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మాత్రమే షుగర్‌ బారిన పడకుండా ఉంటాము.

Tags:    

Similar News