రుతుక్రమం త్వరగా మొదలైతే.. ఆ విషయంలో అంత లాభమట

ఆడపిల్లలు చిన్నవయసులోనే త్వరగా రజస్వల అయ్యదానికి.. తర్వాత వారి ఎత్తుకు మధ్య ఉన్న సంబంధం లెక్క వెలుగు చూసింది

Update: 2024-10-01 14:30 GMT

ఆసక్తికర విషయాన్ని తాజాగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఆడపిల్లలు చిన్నవయసులోనే త్వరగా రజస్వల అయ్యదానికి.. తర్వాత వారి ఎత్తుకు మధ్య ఉన్న సంబంధం లెక్క వెలుగు చూసింది. త్వరగా రజస్వల అయ్యే బాలికలు.. ఆ తర్వాత ఎక్కువ ఎత్తు పెరిగే అవకాశాలు ఉంటాయని తాజా అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఇంతకూ ఈ అధ్యయనాన్ని ఎవరు రూపొందించారు? వారు గుర్తించిన మరిన్ని వివరాల్లోకి వెళితే..

స్వీడన్ లోని గుటెన్ బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు దాదాపు 800 మందిపై ఒక అధ్యయనాన్ని చేపట్టారు. బాలికలు త్వరగా రజస్వల అయితే వారి ఎత్తు పెరగటాన్ని తమ పరిశోధనల్లో గుర్తించినట్లుగా చెబుతున్నారు. రుతుక్రమం మొదలయ్యాక బాలికలు సగటున 6-8 సెంటీమీటర్లు ఎత్తు పెరుగుతారని గతంలోనూ కొన్ని అధ్యయనాలు పేర్కొన్నట్లుగా వెల్లడించారు. అయితే.. ఈ పెరుగుదలలో వ్యత్యాసాల్ని తాజా అధ్యయనంలో గుర్తించారు.

12 ఏళ్లు అంతకంటే తక్కువ వయసులోనే రుతుక్రమం మొదలైతే.. అప్పటి నుంచి బాలికలు దాదాపు 13 సెంటీమీటర్లు పెరగటానికి అవకాశం ఉందంటున్నారు. 14 ఏళ్లు.. అంతకంటే ఎక్కువ వయసులో రజస్వల అయితే మాత్రం ఎత్తు విషయంలో పెద్దగా ఉండదన్న విషయాన్ని చెబుతున్నారు. పద్నాలుగేళ్లు.. ఆ తర్వాత పెద్ద మనిషి అయ్యే బాలికలు సగటున మూడు సెంటీమీటర్లకు మించి ఎదిగే వీల్లేదన్న మాట వినిపిస్తోంది. ఏమైనా.. చిన్న వయసులోనే రజస్వల అయితే.. ఎత్తు విషయంలో అంతో ఇంతో మేలు జరుగుతుందని మాత్రం చెప్పక తప్పదు.

Tags:    

Similar News