జనాభాలో 30 మంది సమస్య... 'ఫ్యాటీ లివర్' పై కీలక విషయాలు!
ఇటీవల కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువమందిలో ఏర్పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో మొత్తం జనాభాలో సుమారు 30 మందికి ఈ సమస్య ఉందని చెబుతున్నారు.
ఇటీవల కాలంలో ఫ్యాటీ లివర్ సమస్య ఎక్కువమందిలో ఏర్పడుతుందని అంటున్నారు. ఈ క్రమంలో మొత్తం జనాభాలో సుమారు 30 మందికి ఈ సమస్య ఉందని చెబుతున్నారు. ఈ సందర్భంగా ఈ సమస్య రాకుండా ఏమి చేయాలి.. వచ్చాక ఎలాంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది మొదలైన విషయాలను వెల్లడించారు ప్రముఖ హెపటాలజిస్ట్, ఐ.ఎల్.బీ.ఎస్. డైరెక్టర్, ప్రొఫెసర్ శివకుమార్ సరిన్ అన్నారు.
అవును... ప్రముఖ జీర్ణకోశ, కాలేయ వ్యాధి నిపుణులు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ శివకుమార్ సరిన్ రాసిన "ఓన్ యువర్ బాడీ" పుస్తకాన్ని గచ్చిబౌలిలోని ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ (ఏఐజీ)లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో... ఏఐజీ ఛైర్మన్ డాక్టర్ నాగేశ్వరరెడ్డి, సైయెంట్ సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ బీవీఆర్ మోహన్ రెడ్డి, సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాజలిస్ట్ డాక్టర్ జీవీ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా స్పందించిన సరిన్... జనాభాలో 30 శాతం మంది ఈ ఫ్యాటీ లివర్ సమస్యను ఎదుర్కొంటున్నారని.. దీన్ని నియంత్రించడం ద్వారా మధుమేహం, గుండె జబ్బులకు దూరంగా ఉండొచ్చని అన్నారు. ఇదే సమయంలో ఈ సమస్య లివర్ సిరోసిస్ కు, లివర్ ఫెయిల్యూర్ కు దారి తీస్తుందని తెలిపారు. ఎవరికైనా మెడ వెనుక నల్లని గీత మాదిరిగా ఏర్పడితే.. మున్ముందు గుండె వ్యాధులు రావడానికి గుర్తుగా భావించాలని సూచించారు.
అనంతరం.. "ఓన్ యువర్ బాడీ" పుస్తకంపై డాక్టర్ సరిన్, డాక్టర్ నాగేశ్వర రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా.. సమతుల ఆహారం తీసుకోవడంతోపాటు.. నిత్యం గంటపాటు చెమట పట్టేలా వ్యాయామం చేయడం చేయాలని అన్నారు. ఇదే సమయంలో.. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండటం వల్ల ఫ్యాటీ లివర్ సమస్య ఉత్పన్నం కాదని పుస్తక రచయిత డాక్టర్ సరిన్ తెలిపారు.
ఈ సందర్భంగా స్పందించిన డాక్టర్ నాగేశ్వర రెడ్డి... ఫ్యాటీ లివర్ సమస్యపై ఏఐజీ ఆధ్వర్యంలో పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఇదే సమయంలో... స్కూల్స్ వద్ద జంక్ ఫుడ్స్, ప్యాకెట్ ఫుడ్స్ విక్రయించకుండా నిషేధం విధించాలని అన్నారు. అనంతరం డాక్టర్ బీఆర్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎవరి ఆరోగ్యానికి వారే బాధ్యులని అన్నారు.