అమెరికాలో కాదు.. ఇండియాలోనే ‘జాబ్’ దొరకడం కష్టం
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదన్నది ఓ ఫేమస్ డైలాగ్. అయితే ఇప్పుడు టాలెంట్ నే అన్ని సమస్యలకు పరిష్కారంగా మారింది;
కంటెంట్ ఉన్నోడికి కటౌట్ అవసరం లేదన్నది ఓ ఫేమస్ డైలాగ్. అయితే ఇప్పుడు టాలెంట్ నే అన్ని సమస్యలకు పరిష్కారంగా మారింది. అమెరికాలో ఒక ఇండియన్ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి ఇండియాలో సరిపడా టాలెంట్ లేక ఉద్యోగం దొరకడం లేదంటే నమ్మగలరా? నిజంగా నిజమే ఇదీ.. అమెరికాలో స్కిల్స్ కంటే ఇండియాలో ఇంకా మెరుగైన స్కిల్స్ ఉంటేనే జాబ్ దొరకుతోందట.. ఇది ఓ టెకీ చెబుతున్న మాట.. అంతలా మన సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో ప్రమాణాలు పెరిగాయని ఓ టెకీ పోస్ట్ ద్వారా తాజాగా బయటపడింది.
అమెరికాలో 12 ఏళ్లు గడిపిన ఓ భారతీయ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, కుటుంబ బాధ్యతల కారణంగా భారత్‌కు తిరిగి రావాలని నిర్ణయించుకున్నాడు. అయితే, భారతీయ ఐటీ పరిశ్రమలో ఉద్యోగం పొందడం అనుకున్నంత సులభంగా లేదనే సమస్య అతనికి ఎదురైంది.మిషిగన్ యూనివర్సిటీ నుంచి మాస్టర్స్ పూర్తిచేసిన ఈ టెకీ, గత 9 ఏళ్లుగా అమెరికాలో ఫుల్ స్టాక్ డెవలపర్‌గా పనిచేశాడు. పైథాన్, డీజాంగో, జావాస్క్రిప్ట్, పోస్ట్‌గ్రెస్‌క్యూఎల్ వంటి టెక్నాలజీల్లో మంచి అనుభవం ఉన్నా, భారతీయ ఐటీ కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా క్లౌడ్ కంప్యూటింగ్, డోకర్, కుబెర్నేటిస్ వంటి కొత్త టూల్స్‌లో అనుభవం లేకపోవడం అతనికి ప్రధాన అవరోధంగా మారింది.
-భారత్‌లో ఉద్యోగాన్వేషణ - ఎదురైన సవాళ్లు
తల్లి ఆరోగ్య సమస్యలు, తండ్రి వయసు 78 ఏళ్లు కావడంతో అతను మే నెలలో భారత్‌కు రావాలని నిర్ణయించుకున్నాడు. అయితే గత ఆరు నెలలుగా ఉద్యోగాన్వేషణ చేస్తూనే ఉన్నా, కేవలం ఒక ఇంటర్వ్యూకే అవకాశం లభించింది. కానీ, పెద్ద స్థాయి స్కేలబుల్ అప్లికేషన్లపై అనుభవం లేకపోవడం, మారుతున్న ట్రెండ్‌లకు అనుగుణంగా స్కిల్స్ అప్‌డేట్ చేసుకోవడంలో కొంత వెనుకబడి ఉండటంతో ఆ అవకాశాన్ని కోల్పోయాడు.
- ఇంటర్నెట్ ద్వారా మద్దతు
ఈ సమస్యను రెడిట్ వేదికగా పంచుకున్న అతనికి అనేక మంది తమ సూచనలు అందించారు. అనుభవజ్ఞులు అతనికి కొన్ని ముఖ్యమైన మార్గదర్శకాలను ఇచ్చారు:
1. అప్‌స్కిలింగ్: కొత్తగా డిమాండ్ ఉన్న టెక్నాలజీలలో నైపుణ్యం సాధించుకోవడం.
2. ఫ్రీలాన్స్ & రిమోట్ జాబ్స్: ఫ్రీలాన్సింగ్ ద్వారా అనుభవాన్ని పెంచుకోవడం.
3. నెట్‌వర్కింగ్: ఇండస్ట్రీలోని పాత సహచరులను సంప్రదించడం, కొత్త పరిచయాలను పెంచుకోవడం.
4. స్టార్టప్‌లను టార్గెట్ చేయడం: పెద్ద కంపెనీలతో పోటీ పడకుండా, స్టార్టప్‌లలో అవకాశాలను వెతకడం.
5 అమెరికా కంపెనీల బ్రాంచ్‌లలో అవకాశం: ఇప్పటికే పని చేస్తున్న అమెరికా కంపెనీల ఇండియా బ్రాంచ్‌లో బదిలీ కోసం ప్రయత్నించడం.
ఉద్యోగ నిపుణుల సూచనల ప్రకారం, మారుతున్న టెక్నాలజీలపై పట్టుసాధించి, నెట్‌వర్కింగ్ పెంచుకుంటే భారత్‌లో మంచి అవకాశాలు దొరికే అవకాశాలు మెరుగవుతాయని అంచనా వేయబడింది. గ్లోబల్ ఐటీ పరిశ్రమలో భారతీయ ఐటీ ఉద్యోగులుగా ఉండటానికి కొనసాగుతూనే, నూతన టెక్నాలజీలపై దృష్టి పెడితే, సరైన ఉద్యోగ అవకాశాలను పొందగలుగుతారని విశ్లేషకులు సూచిస్తున్నారు.