నియోజకవర్గాల మార్పు.. ఏపీ, తెలంగాణకు మేలే!
ఇదిలావుంటే.. ఏపీ, తెలంగాణలకు మాత్రం డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా మేలు జరుగుతుందని మేధావులు చెబుతున్నారు.;
కేంద్ర ప్రభుత్వం 2026లో పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన చేపట్టనుంది. డీలిమిటేషన్ ప్రక్రి యకు సంబంధించి త్వరలోనే నోటీసు కూడా ఇవ్వనుంది. దీనిపై దక్షిణాది రాష్ట్రాలు కొంత యాగీ చేస్తు న్న విషయం తెలిసిందే. తమకు అన్యాయం జరుగుతుందని, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు తగ్గుతా యని తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు ఆందోళన బాటపట్టాయి. అయితే.. కేంద్రం మాత్రం నియోజకవర్గా లు తగ్గబోవని చెబుతోంది.
ఇదిలావుంటే.. ఏపీ, తెలంగాణలకు మాత్రం డీలిమిటేషన్ ప్రక్రియ ద్వారా మేలు జరుగుతుందని మేధావులు చెబుతున్నారు. విభజన చట్టం ఈ రెండు రాష్ట్రాలకు రక్షణ ఛత్రంగా మారుతుందని అంటున్నారు. 2014 నాటి రాష్ట్ర పునర్వివిభజన చట్టం ప్రకారం.. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు అసెంబ్లీ స్థానాల్లో మార్పులు వస్తున్నాయి. ఏపీకి ప్రస్తుతంఉన్న 175 స్థానాలకు గాను మరో 50, తెలంగాణకు కూడా 35-45 స్థానాల వరకు పెరగనున్నాయి. ఇది చాలా ఆశావహ వ్యవహారం.
తద్వారా.. ఇప్పటి వరకు లైన్‌లో ఉన్న చాలా మంది నాయకులకు అవకాశాలు చిక్కుతాయి. అంతేకాదు.. పార్టీలు కొత్తగా చేర్చుకునే నాయకులకు, యువతరానికి కూడా భారీ ఎత్తున నియోజకవర్గాలు పెరిగి పోటీకి పోటీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇక, పార్లమెంటు విషయానికి వస్తే.. ఈ విషయం విభజన చట్టంలో లేదు. కానీ, ప్రస్తుతం ఉన్న అంచనాల ప్రకారం..ఏపీకి 25 స్థానాలు ఉంటే.. ఇవి 32కు పెరగనున్నాయి. అంటే.. ఏడు నియోజవర్గాలు పెరగనున్నాయని తెలుస్తోంది.
వీటిలో పెద్ద నియోజకవర్గాలు ఎక్కువగా ఉన్నాయి. గుంటూరు, అల్లూరి జిల్లాల్లో రెండేసి చొప్పున కొత్త నియోజకవర్గాలు ఏర్పడనున్నాయి. అదేవిధంగా తెలంగాణలో ప్రస్తుతం 17 పార్లమెంటు స్థానాలు ఉంటే.. ఇవి 3 నుంచి 4కు పెరగనున్నాయి. కరీంనగర్, నిజామాబాద్ వంటి పెద్ద నియోజనకవర్గాలను రెండుగా విభజించే అవకాశం ఉంది. అయితే.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నిజామాబాద్‌ను రెండు నియోజకవ ర్గాలు చేయాలన్న ప్రతిపాదన ఉన్నా.. ఇది బీజేపీకి బలమైన నియోజకవర్గంగా ఉండడంతో దీనిని విడదీసి కొత్తది ఏర్పాటు చేయకపోవచ్చని తెలుస్తోంది.