బ్యూటీ పార్లర్ లో మహిళ జుట్టు ఊడిపోయింది... భర్త కోరికే కారణం?
హెయిర్ కట్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లిన మహిళకు షాక్ తగిలింది. ఆ మహిళకు హెయిర్ కట్ చేసి ఆయిల్ పెట్టగానే మొత్తం జుట్టు ఊడిపోయింది.
తాజాగా హైదరాబాద్ లోని ఒక బ్యూటీపార్లర్ లో జరిగిన ఒక విషయం హాట్ టాపిక్ గా మారింది. హెయిర్ కట్ కోసం అని బ్యూటీ పార్లర్ కి వెళ్లిన ఒక మహిళ.. బయటకు వచ్చేటప్పుడు అరగుండుతో వచ్చింది! ఆ బ్యూటీపార్లల్ లో పెట్టిన ఆయిల్ వల్ల తన జుట్టంతా ఊడిపోయిందని చెబుతోంది.
అవును... హెయిర్ కట్ చేయించుకునేందుకు బ్యూటీ పార్లర్ కు వెళ్లిన మహిళకు షాక్ తగిలింది. ఆ మహిళకు హెయిర్ కట్ చేసి ఆయిల్ పెట్టగానే మొత్తం జుట్టు ఊడిపోయింది. ఈ సంఘటన హైదరాబాద్ లోని అబిడ్స్ ప్రాంతంలో జరిగింది. బ్యూటీషియన్ నిర్వాకం వల్లే తన జుట్టు ఊడిపోయిందని ఆరోపిస్తున్న ఆ మహిళ... నేరుగా పీఎస్ లో ఫిర్యాదు చేసింది.
వివరాళ్లోకి వెళ్తే... పాతబస్తీకి చెందిన మహిళ.. మోడల్ గా చూడాలనుకున్న తన భర్త కోరిక మేరకు బ్యూటీపార్లర్ కు వెళ్లిందని తెలుస్తోంది. దీంతో... సదరు మహిళకు పార్లర్ సిబ్బంది హెయిర్ కట్ చేసి ఆయిల్ పెట్టారు. అనంతరం జుట్టు మొత్తం ఊడిపోవడం మొదలైంది.
దీంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో పార్లర్ లో పెట్టిన హెయిర్ ఆయిల్ తోనే తన జుట్టు ఊడిపోయిందని ఆ మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అసలు తన భర్తకు ఇలాంటి కోరిక రాకపోతే అసలు ఎలాంటి సమస్యా ఉండేది కాదు కదా అని సన్నిహితుల వద్ద ఆమె వాపోతుందని అంటున్నారు!
కాగా.. బ్యూటీ పార్లర్ నిర్వాహకుల నిర్వాకంతో గతం లో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఫలితంగా బ్యూటీ పార్లర్ అంటే మహిళలు హడలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇందులో భాగంగా ఈ బ్యూటీ పార్లర్ లలో గతం లో జరిగిన విషయాలు గుర్తుచేస్తున్నారు.
గతం లో... ఫేస్ వ్యాక్స్ చేయించుకున్న మహిళల కు ముఖం పై ఎర్రగా కందిపోయి, నీటి పొక్కులు రావడం... ఫేస్ మాస్క్ వికటించి మొహం నల్లగా మారిపోవడం వంటి ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. అయితే... కొంతమంది బ్యూటీషియన్లకు సరైన అవగాహన లేకపోవడం, నాణ్యమైన మెటీరియల్ వాడకపోవడంతో మహిళల కు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయని అంటున్నారు.