యూపీలో శివారాధన కార్యక్రమంలో దారుణం... 100 మంది మృతి!

అవును... ఉత్తరప్రదేశ్ లోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది.

Update: 2024-07-02 14:41 GMT

ఉత్తరప్రదేశ్ లోని హాథ్రస్ లో పెను విషాదం చోటుచేసుకుంది. రతిభాన్ పుర్ లో శివారాధన కార్యక్రమ సమయంలో తొక్కిసలాట జరగడంతో ఈ దారుణం సంభవించినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో సుమారు 100 మంది మృతి చెందినట్లు చెబుతున్నారు. చాలా మంది గాయపడ్డారని సమాచారం. అటు మృతుల్లోనూ, గాపడినవారిలోనూ మహిళలు, చిన్నారులూ ఉన్నారని అంటున్నారు.

అవును... ఉత్తరప్రదేశ్ లోని ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో భారీ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య 100 కు చేరగా.. గాయపడినవారి సంఖ్యా భారీగా ఉందని అంటున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో గాయపడినవారిని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. ఈ ఘటనపై విచారణకు ఆదేశించింది.

ఈ సందర్భంగా జిల్లా మెజిస్ట్రేట్ ఆశీష్ కుమార్ స్పందించారు. ఇందులో భాగంగా... జిల్లా అధికార యంత్రాంగం ఈ ఘటనపై ఉన్నతస్థాయి దర్యాప్తు చేస్తోందని తెలిపారు. ఇదే సమయంలో... గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా మృతుల కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలపై దృష్టి సారించినట్లు తెలిపారు.

ఇదే సమయంలో... ఈ ఘటనలో మృతులు, క్షతగాత్రుల వివరాలను ఇటా చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఉమేష్ త్రిపాఠీ వెల్లడించారు. ఇందులో భాగంగా ఇప్పటివరకూ పలు మృతదేహాలను పోస్ట్ మార్టం కోసం తీసుకొచ్చారని అన్నారు. మరోపక్క గాయపడినవారికి చికిత్స అందుతోందని తెలిపారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారని వెల్లడించారు.

మరోపక్క ఈ విషాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యల్లో పాల్గొనాలని అధికారులను ఆదేశించారు. ఇదే సమాయంలో విచారణకు ఆదేశించారు. ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50 వేలు పరిహారం ప్రకటించారు!!

Tags:    

Similar News