ఢిల్లీ గాలి గరళం...పరిస్థితి ప్రమాదం!

ఢిల్లీ దేశ రాజధాని. మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వారు అంతా ఢిల్లీకి వస్తూ పోతూ ఉంటారు.

Update: 2023-11-05 17:25 GMT

ఢిల్లీ దేశ రాజధాని. మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలకు చెందిన వారు అంతా ఢిల్లీకి వస్తూ పోతూ ఉంటారు. ఇక ఢిల్లీలో ఒక ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఉంది. అన్ని మంత్రిత్వ శాఖలు అక్కడే ఉంటాయి. అలా ఢిల్లీ ట్రాఫిక్ దిగ్బంధనంలో చిక్కుకుని విలవిలలాడుతోంది.

ప్రతీ ఏటా శీతాకాలం మొదలైతే చాలు ఢిల్లీ గాలి గరళం అయిపోతోంది. అత్యంత ప్రమాదకరం అయిపోతుంది. కాలుష్యపు గాలి నిండా చేరి ఆక్సిజన్ ని చంపేస్తుంది. ఊపిరి ఆడక ఉక్కిరి బిక్కిరి కావడం ఢిల్లీ పౌరులకు భయంకరమైన అనుభవంగా మారుతోంది.

ఇదిలా ఉంటే అంతకంతకు రోజురోజుకీ ఢిల్లీ గాలిలో నాణ్యత తగ్గిపోతోంది దిగజారిపోతోంది అని అంతా ఆందోళన చెందుతున్నారు. ఆదివారం నాటికి చూస్తే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 483 పాయింట్లకు చేరగా ప్రపంచంలోనే అత్యంత కాలుష్య మయమైన నగరాల జాబితాలో ఢిల్లీ మొదటి సారిలో నిలిచింది.

దాంతో ఢిల్లీ వాసులు బెంబేలెత్తిపోతున్నారు. ఈ నేపధ్యంలో అధికారులు ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలలో సగానికి సగం సిబ్బందిని బయటకు రావద్దని ఆదేశాలు జారీ చేశారు. వారంతా ఇళ్ల వద్దనే ఉంటూ వర్క్ ఫ్రం హోం చేయాలని ఆదేశాలు ఇవ్వాలని కూడా సూచించారు. ఈ మేరకు కేంద్రం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది.

అలాగే ఢిల్లీ నగరంలోకి ట్రక్కుల రాకను నిషేదించారు. ఇక నిర్మాణం పనులను కూడా రద్దు చేశారు. ఇదంతా ఢిల్లీ అత్యంత కాలుష్యంతో ఉందని తెలియచేసేవే. మామూలుగా చూస్తే అయిర్ క్వాలిటీ ఇండెక్స్ 450 దాటితే ఈ తరహా నిబంధనలను వర్తింపచేస్తారు.

దీంతో ఇపుడు ఢిల్లీ తనకు వచ్చిన కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలో ఆలోచిస్తూ నిషేధాలను అమలు చేస్తోంది. కాలుష్యం కప్పుకున్న ఢిల్లీలో ఆక్సిజన్ కోసం జనాలు ఇబ్బంది పడాల్సి వస్తోంది. శీతాకాలంలో తేమ బాగా ఉండడం తెట్టు లాగ అది గాలిలోనే ఉండిపోయి కాలుష్యం ఎటూ పోకుండా గాలిని బంధిస్తుంది. నాణ్యతను లేకుండా చేస్తుంది. ఇది ఏటేటా ఢిల్లీకి వస్తున్న ఇబ్బందే. కానీ పరిష్కారాలు అన్నీ తాత్కాలికం కావడమే విషాదకరం. శాశ్వత పరిష్కారాల వైపుగా ఢ్ల్లీ అడుగులు వేస్తే దేశంలోని మిగిలిన నగరాలకు అది మార్గదర్శకంగా ఉంటుంది.

Tags:    

Similar News