వామ్మో... ఏఐ తో ఆ ముప్పు కూడా ఉందా..?

ఈ క్రమంలో... మెషిన్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకుడు ఎలిజర్‌ యడ్కోవ్‌ స్కీ మాత్రం మానవాళికి ఏఐతో ఏ రేంజ్‌ లో ముప్పు పొంచి ఉందనే విషయాన్ని చెబుతున్నారు.

Update: 2024-02-20 07:41 GMT

ఇటీవల కాలంలో టెక్నికల్ సంచలనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఏ స్థాయిలో వైరల్ ఇష్యూగా మారిందనేది తెలిసిన విషయమే. ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ విషయం గురించే ఆలోచిస్తుంది! ఇదే సమయంలో ఏఐ వల్ల కలిగే ప్రయోజనాల గురించి చర్చ జరుగుతుంటే... మరోపక్క ఏఐ వల్ల కలిగే నష్టాలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ సమయంలో అంతకు మించిన ఒక భారీ నష్టం మానవాళికి ఏఐ వల్ల పొంచి ఉందని అంటున్నారు.

అవును... ఈ అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో భవిష్యత్తులో ఎదురయ్యే సవాళ్లపై సరికొత్త చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగాలు పోయాయని.. ఇకపై ఈ సంఖ్య భారీగా ఉండబోతుందని కథనాలొస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థల సీఈఓలు ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన చేస్తున్నారు.

ఈ క్రమంలో... మెషిన్‌ ఇంటెలిజెన్స్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ వ్యవస్థాపకుడు ఎలిజర్‌ యడ్కోవ్‌ స్కీ మాత్రం మానవాళికి ఏఐతో ఏ రేంజ్‌ లో ముప్పు పొంచి ఉందనే విషయాన్ని చెబుతున్నారు. ఇందులో భాగంగా... మానవాళి మనుగడనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రమాధాకారిగా మారబోతుందని చెబుతున్నారు. టైం కరెక్ట్ గా చెప్పలేకపోయినా... రిజల్ట్ మాత్రం కన్ ఫాం అనేది ఆయన వెర్షన్.

ఈ క్రమంలో తాజాగా ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కు సంబంధించిన విషయాలపై స్పందించిన యడ్కోవ్‌ స్కీ... ఈ సంచలన విషయం వెల్లడించాడు. ఇందులో భాగంగా... మరో రెండేళ్లు, లేదంటే ఐదేళ్లు, పోని పదేళ్లు... టైం కాస్త అటు ఇటు అయినా మానవాళికి ఏఐ వల్ల మిగిలి ఉన్న గడువు ఇదే అని సంచలన ప్రకటన చేశారు.

టెర్మినేటర్‌, మ్యాట్రిక్స్‌ వంటి హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లుగా మెషీన్లతోనే మానవాళి అంతం అని వివరించారు. సాధారణంగా... ఏఐ వల్ల భవిష్యత్తులో భారీ ఎత్తున ఉద్యోగాలు పోతాయని చాలా మంది చెబుతున్న వేళ... యడ్కోవ్‌ స్కీ మాత్రం ఏఐతో ఏకంగా మానవాళికే ముప్పు అని హెచ్చరికలు జారీచేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది.

Tags:    

Similar News