బీఫారం అందగానే నామినేషన్లు..కూటమిలో కొత్త పాలిటిక్స్...!
ఇలా బీఫారం చేతిలో పడగానే అలా నామినేషన్లు వేసేస్తున్నారు టీడీపీ కూటమి అభ్యర్ధులు. అది కూడా నామినేషన్లు తొలి రోజునే నామినేషన్లు వేయడం విశేషం.
ఇలా బీఫారం చేతిలో పడగానే అలా నామినేషన్లు వేసేస్తున్నారు టీడీపీ కూటమి అభ్యర్ధులు. అది కూడా నామినేషన్లు తొలి రోజునే నామినేషన్లు వేయడం విశేషం. చాలా మంది ప్రముఖులు కూడా ఇందులో ఉంటున్నారు. వీరంతా చాలా రోజుల ముందు నుంచే ముహూర్తం పెట్టుకుని కూర్చున్నారు ఇలా నోటిఫికేషన్ రావడమేంటి అలా నామినేషన్లు వేసేస్తున్నారు.
ఏప్రిల్ 18న నాలుగవ విడతగా ఏపీలో నామినేషన్ల ఘట్టానికి తెర లేచింది. తొలి రోజునే పెద్ద ఎత్తున నామినేషన్లు పడడం ఈసారి ఎన్నికల విశేషం. అందులో దాదాపుగా అన్ని నామినేషన్లు టీడీపీ కూటమి నుంచే ఉండడం విశేషం. దీని వెనక కారణం ఏంటి అన్నది చూస్తే కనుక చాలానే ఉంది.
నామినేషన్ల రోజే ఒక టీడీపీ అభ్యర్ధి అభ్యర్ధిత్వం పోయింది. అనకాపల్లి జిల్లా మాడుగుల అసెంబ్లీ సీటుకి మొదట టీడీపీ తరఫున ప్రకటించిన ఎన్నారై పైలా ప్రసాదరావు ప్లేస్ లో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తిని ప్రకటించారు. దాంతో పైలా ఆశలు అడియాశలు అయ్యాయి. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
దీనిని చూసిన వారు ఇంకా మరికొన్ని సీట్లలో మార్పుచేర్పులు జరుగుతాయని భావిస్తున్న వారు అంతా ఎందుకైనా మంచిదని నామినేషన్లు వేసేస్తున్నారు భీమిలీ టికెట్ విషయంలో ఎంతో పోరాడి సాధించిన మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు మొదటి రోజునే నామినేషన్ వేసేసి ఒక పని అయిపోయింది అనిపించారు.
మరో వైపు చూస్తే ఒంగోలు లోక్‌సభ స్థానానికి తెలుగు దేశం పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బస్తిపాడు నాగరాజు, విజయవాడ పశ్చిమ శాసనసభ స్థానానికి బి జే పి తరఫున కేంద్ర మాజీ మంత్రి సుజనాచౌదరి తొలి రోజునే నామినేషన్లు వేశారు.
అదే విధంగా చాలా మంది కీలక నాయకులు ఈ నెల 19న నామినేషన్లు వేయడానికి రెడీ అవుతున్నారు. దీనిని బట్టి చూస్తే నామినేషన్ వేసేస్తే ఇక వారిని కదపడం సాధ్యం కాదు అని భావిస్తున్నారు అన్న మాట. అధినాయకత్వం ఎత్తులకు పై ఎత్తులు వేయడానికే ఇలా చేశారు అని అంటున్నారు.
ఇంకో వైపు చూస్తే జనసేన అధినాయకత్వం తాము పొత్తులలో తీసుకున్న సీట్లే 21. అయితే వాటిని విడతల వారీగా ప్రకటించింది. నిన్నా మొన్నటివరకూ లిస్ట్ అలా రిలీజ్ చేస్తూనే ఉంది. కానీ నామినేషన్లకు ఒక రోజు ముందు మొత్తం 21 మంది అభ్యర్ధులకు బీఫారాలు ఇచ్చేసి పవన్ కళ్యాణ్ చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించారు అని అంటున్నారు.
ఇది కూడా కూటమిలో సీట్ల మార్పుచేర్పులకు అవకాశం ఇవ్వకుండా తీసుకున్న ముందస్తు చర్య అని అంటున్నారు. జనసేన సీట్లలో ఇంకా తమ్ముళ్ళు ఆశలు పెట్టుకున్నారు. అలాంటి సీట్లు ఉత్తరాంధ్రాతో పాటు గోదావరి జిల్లాలు అలాగే సీమలో ఒక సీటులో ఉన్నాయని అంటున్నారు. దాంతో ఎపుడు ఎవరి మనసు ఎలా మారుతుందో అని ఆలోచించే పవన్ ఈ విధంగా డెసిషన్ తీసుకున్నారు అని అంటున్నారు.
అదే విధంగా చూస్తే బీజేపీకి చెందిన అభ్యర్ధులు కూడా తొందర పడుతున్నారు. అన్ని నామినేషన్లు కూడా రానున్న మూడు రోజులలోనే వేసేలా చర్యలు తీసూంటున్నారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం పొత్తులలో భాగంగా 144 సీట్లకు పోటీ చేస్తోంది. అలాగే 17 ఎంపీ సీట్లలో పోటీ పడుతోంది. అయితే 21 మంది అసెంబ్లీ అభ్యర్ధులకు మాత్రమే బాబు బీఫారాలు ఇప్పటిదాకా ఇచ్చారని అంటున్నారు. మిగిలిన వారికి విడతల వారీగా ఇస్తారని అంటున్నారు.
అయితే బీఫారాలు తరువాత జత చేయవచ్చు ముందు నామినేషన్లు వేద్దామని అనుకున్న వారు కూడా తమ నామినేషన్లు వేసేస్తున్నారు అని అంటున్నారు. ఇక వైసీపీ విషయానికి వస్తే బీఫారాలు ఆ పార్టీ ఎపుడు ఇస్తుందో తెలియదు. జగన్ తరఫున నామినేషన్ అయితే ఈ నెల 22న దాఖలు అవుతోంది. ఆయన స్వయంగా 25న నామినేషన్ వేస్తారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే వైసీపీ తప్ప కూటమిలో ఉన్న వారు మాత్రం యమ కంగారు గా నామినేషన్లు వేసేస్తున్న నేపధ్యం కనిపిస్తోంది.