మోడీతో పాడ్ కాస్ట్... ఆకట్టుకుంటోన్న ఫ్రీడ్ మాన్ గాయత్రీ మంత్రం!

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశోధకుడు లెక్స్ ఫ్రీడ్ మాన్ పాడ్ కాస్ట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే.;

Update: 2025-03-17 05:36 GMT

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పరిశోధకుడు లెక్స్ ఫ్రీడ్ మాన్ పాడ్ కాస్ట్ లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్న సంగతి తెలిసిందే. సుమారు మూడు గంటల పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో ఓ సన్నివేశం మాత్రం నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... గాయత్రీ మంత్రాన్ని అమెరికన్ అయిన ఫ్రీడ్ మాన్ జపించగా.. ప్రధాని ఆయనను అభినందించారు.

అవును... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిశోధకుడు లెక్స్ ఫ్రీడ్ మాన్ పాడ్ కాస్ట్ లో ప్రధాని మోడీ పాల్గొన్న ఇంటర్వ్యూలోని ఫ్రీడ్ మాన్ గాయత్రీ మంత్రాన్ని జపించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇందులో భాగంగా... హిందూ ప్రార్థన లేదా ధ్యానంతో కొన్ని క్షణాలు మీరు నాకు మార్గనిర్దేశనం చేయగలరా? గాయత్రీ మంత్రాన్ని నేర్చుకునేందుకు నేను ప్రయత్నిస్తున్నాను అని ఫ్రీడ్ మాన్ అన్నారు.

ఇదే సమయంలో... ఈ మంత్రం విశిష్టత, జీవితంలో ఆధ్యాత్మికత ప్రాముఖ్యత గురించి మీరు వివరిస్తారా? ఇప్పుడు నేను గాయత్రీ మంత్రాన్ని పఠించేందుకు ప్రయత్నించనా? అని ఫ్రీడ్ మాన్.. ప్రధాని మోడీని కోరారు. ఈ సమయంలో ఫ్రీడ్ మాన్ విజ్ఞప్తికి మోడీ సమ్మతించడంతో గాయత్రీ మంత్రాన్ని జంపించారు. అనంతరం... ఎలా పఠించాను అని మోడీని అడిగారు ఫ్రీడ్ మాన్.

ఈ సందర్భంగా స్పందించిన ప్రధాని... చాలా గొప్పగా చెప్పారు.. ఈ మంత్రం సూర్యుడి ప్రకాశవంతమైన శక్తికి అంకితం.. ఆధ్యాత్మిక జ్ఞానోదయానికి శక్తివంతమైన సాధనగా దీన్ని పరిగణిస్తారు అంటూ ఫ్రీడ్ మాన్ ప్రయత్నాన్ని ప్రశంసించారు. ఈ సందర్భంగా... ఈ పాడ్ కాస్ట్ కు ముందు తాను 45 గంటల పాటు ఉపవాశం ఉన్నానని ఫ్రీడ్ మాన్ చెప్పారు.

ఇందులో భాగంగా... ప్రధానితో చర్చకు గౌరవ సూచకంగా కేవలం నీరు మాత్రమే తీసుకున్నానని.. ఎటువంటి ఆహారం ముట్టలేదని తెలిపారు. ఆధ్యాత్మిక స్థాయిని చేరుకోవడం కోసమే తాను అలా చేశానని ఫ్రీడ్ మాన్ తెలిపారు. దీంతో... తనపై గౌరవంతో ఉపవాసం చెసినందుకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Tags:    

Similar News