రెండు రోజుల్లో రేవంత్ సర్కారు అవినీతి స్కాంలను బయటపెడతాడట!

తరచూ సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలంగాణ బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు.

Update: 2025-01-03 05:17 GMT

తరచూ సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే తెలంగాణ బీజేపీ శాసన సభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరోసారి వార్తల్లోకి వచ్చారు. మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వ అవినీతి కుంభకోణాల్ని తాను బయటపెడతానని పేర్కొన్నారు. ఇప్పటికే తన వద్ద కుంభకోణాలకు సంబంధించిన చాలా ఆధారాలు ఉన్నాయన్న ఆయన.. ఇందులో మంత్రుల హస్తం కూడా ఉందన్నారు.

తాను బయటపెట్టే స్కాంలకు సంబంధించిన అన్ని వివరాలు తన వద్ద ఉన్నట్లుగా పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా డైలాగులు బాగానే కొడున్నారన్న ఆయన.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్నా.. ఇప్పటివరకు ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందన్నారు. గడిచిన ఏడాది మొత్తం ఎగవేతల నామ సంవత్సరంగా ముగిసిందన్న ఏలేటి.. కొత్త సంవత్సరంలో అయినా ఇచ్చిన హామీల్ని గుర్తు తెచ్చుకొని నెరవేర్చాలన్నారు. రైతు భరోసా ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అమలు చేయకుండా.. ఇప్పుడు కమిటీల పేరుతో ప్రభుత్వం సమయాన్ని వేస్టు చేస్తుందన్నారు.

ఏలేటి వ్యాఖ్యల్లో ఆసక్తికరమైన అంశం ఏమంటే.. రెండు రోజుల్లో భారీ కుంభకోణాల్ని బయటపెడతానని.. ప్రభుత్వాన్ని రోడ్డుకు ఈడుస్తానని హడావుడి చేసిన ఆయన.. వాటికి సంబంధించిన చిన్నపాటి క్లూ కూడా ఇవ్వలేదు. తన మాటలు మొత్తం రేవంత్ సర్కారును విమర్శించం.. హామీల అమలులోనూ.. ప్రభుత్వ వైఫల్యాల మీదనే ఆయన మాట్లాడటం గమనార్హం. మరి.. ఏలేటి చెప్పినట్లు రెండు రోజుల్లో బయటపెట్టే సంచలన స్కాంలు ఏమిటో చూడాలి.

Tags:    

Similar News