ఏపీలో టీడీపీ కూటమి సునామీ
ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రాతో పాటు ఉభయ గోఅదావరి జిల్లాలతో మొదలెడితే క్రిష్ణా గుంటూరులలో కూటమి ఊపేస్తోంది.
ఏపీలో టీడీపీ కూటమి సునామీ సృష్టిస్తుందా అంటే అవును అనే తొలి అంచనాల బట్టి అర్ధం అవుతోంది. ఎన్నడూ లేని విధంగా రాయలసీమ ప్రాంతంలో కూడా టీడీపీ తన ఆధిక్యం చూపించడం చూస్తూంటే సైకిల్ జోరుకు బ్రేకులు వేసే పరిస్థితి లేదని అంటున్నారు. అదే విధంగా మరో వైపు చూస్తే గతంలో రెండు దశాబ్దాల కాలంలో గెలవని అనేక నియోజకవర్గాలలో టీడీపీ తొలి రౌండ్ల నుంచే ఆధిక్యం ప్రదర్శించడం చూస్తూంటే ఏపీలో గాలి మార్పు అన్నది స్పష్టంగా అర్ధం అవుతోంది.
ఏపీలో ఇదే తీరున అన్ని రౌండ్లలో జోరు కొనసాగితే టీడీపీ కూటమి 150కి పైగా సీట్లు సాధించినా ఆశ్చర్యం పోనవసరం లేదు అని అంటున్నారు. ఇదిలా ఉంటే ఉత్తరాంధ్రాతో పాటు ఉభయ గోఅదావరి జిల్లాలతో మొదలెడితే క్రిష్ణా గుంటూరులలో కూటమి ఊపేస్తోంది.
అలాగే నెల్లూరు ప్రకాశంలో మెజారిటీ సీట్ల దిశగా కూటమి అడుగులు పడుతున్నాయి. అదే విధంగా రాయలసీమలోని నాలుగు జిల్లాలలో చూస్తే అనంతపురం చిత్తూరు కర్నూల్ లలో సైకిల్ స్పీడ్ అందుకుందని అర్ధం అవుతోంది. ఇక జగన్ సొంత జిల్లా కడపలో కూడా టీడీపీ పాగా వేసే దిశగా అడుగులు వేస్తోంది.
ఈ మొత్తం పరిణామాలు గమనిస్తూంటే ఏపీలో జగన్ ప్రభుత్వం దిగిపోవాలని వారూ వీరూ తేడా లేకుండా అంతా కోరుకున్నారు అని అర్ధం అవుతోంది అంటున్నారు. గ్రామీణ ప్రాంతాలలో వైసీపీకి పట్టు ఉంది అని ఒక అంచనా ఉంది. కానీ కౌంటింగ్ లో ట్రెండ్స్ చూస్తూంటే పట్టణం పల్లె తేడా లేకుండా అంతా టీడీపీ కూటమికి అనుకూలంగానే ఓట్లేశారు అని చెప్పాల్సి వస్తోంది.
ఒక సైలెంట్ వేవ్ అయితే కూటం వైపుగా ఉందని తెలుస్తోంది. అది సునామీగా మారుతోందని కూడా తొలి ట్రెండ్స్ ని బట్టి అర్ధం అవుతోంది. ఈ పరిణామాల నేపధ్యం నుంచి చూసినపుడు వైసీపీని పూర్తి స్థాయిలో కూటమి కట్టడి చేయడమే కాకుండా చాలా చోట్ల జిల్లాలలో క్లీన్ స్వీప్ చేసే దిశగా కూడా అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. గోదావరి జిల్లాలలో చూస్తే టీడీపీ ప్రభంజనం కనిపిస్తోంది అనే చెప్పాలి.
అలా చాలా జిల్లాలలో వైసీపీ లేని వాతావరణం ఉండేలా ఉందని తొలి ట్రెండ్స్ ని బట్టి అర్ధం చేసుకోవాల్సి ఉంది అని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద అండర్ కరెంట్ గా అతి పెద్ద అసంతృప్తి ఉందని కూడా చెబుతున్నారు. అది ఓట్ల రూపంలో బయటపడింది అని అంటున్నారు. అదే సమయంలో టీడీపీ కూటమిని జనాలు విశ్వసించారన్నది కూడా కౌంటింగ్ సరళి పూర్తి స్థాయిలో తెలియచేస్తోంది. ఇక మహిళా ఓట్లు ఈసారి టీడీపీ కూటమి వైపే పడ్డాయని ఈ ట్రెండ్స్ ని బట్టి అర్ధం చేసుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా ఏపీలో హోరా హోరీ పోరు అని వస్తున్న పిక్చర్ కాదు వార్ వన్ సైడ్ అన్నదే చివరికి ఖరారు అయింది అని అంటున్నారు. వైసీపీకి గత