రీల్ 'పుష్ప' ను వదిలేయ్ బన్నీ!
రీల్ పుష్ప ఆయన్ను బాగానే పట్టేసినట్లున్నారు. అదే లేకుంటే రియల్ అల్లు అర్జున్ అయితే రియలిస్టిక్ గా ఇంత వైల్డ్ గా రియాక్టు అయ్యే వారా? అన్నది ప్రశ్న.
ఒక సినిమాలో నటించే వేళలో.. తనకు ఇచ్చిన పాత్రలో నటించకూడదని.. జీవించాలని చెబుతారు. అప్పుడు మాత్రం పాత్ర పండుతుందని చెబుతారు. అందులో తప్పేమీ లేదు. అది నిజం కూడా. కానీ.. ఆ పేరుతో రీల్ నటనలో జీవించటం ఓకే. కానీ.. తాను నటించిన పాత్రను వంట బట్టించుకుంటేనే అసలు సమస్య. ఇప్పుడు అల్లు అర్జున్ అలాంటి సమస్యను ఎదుర్కొంటున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
పుష్ప మూవీని 2019 అక్టోబరులో మొదలు పెట్టారు. ఈ మూవీ రెండు భాగాల్ని కలుపుకుంటే.. ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ దగ్గర దగ్గర ఐదేళ్లు పని చేశారు. మరో సినిమా గురించి ఆలోచించకుండా పుష్ప రెండు భాగాల కోసం ఆయన ఐదేళ్లు కష్టపడ్డారు. అంటే.. ఆ పాత్రను అర్థం చేసుకోవటం.. అవగాహన పెంచుకోవటం.. ఆ మైండ్ సెట్ లో ఉండటం లాంటివన్నీ ఒక ప్రాసెస్ మాదిరి జరిగినట్లుగా చెప్పాలి. సినిమాలో ఒక సీన్ ఎందుకు ఉంటుంది? దానికి కంటిన్యూషన్ ఏముంటుంది? అన్న దాని మీద ఒకరు కాదు ఇద్దరు కాదు వందల మంది ఆలోచిస్తుంటారు. అంతా ఓకే అనుకున్న తర్వాత.. సెట్స్ మీద షూట్ చేస్తున్న వేళలోనూ.. బెటర్ మెంట్ కోసం చివరి క్షణంలోనూ స్క్రిప్టు మార్చొచ్చు. ఒకవేళ సీన్ తీసేసి.. ఓకే అన్న తర్వాత కూడా.. మార్పులకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అంటే.. ఏది ఇట్టే జరిగిపోదు. అలాంటి కష్టాన్ని.. మేధోమధనాన్ని అల్లు అర్జున్ ఎందుకు మిస్ అయినట్లు? ఐదేళ్ల పాటు పుష్పరాజ్ క్యారెక్టర్ ను మోసిన ఆయన.. తనకు తెలీకుండా తానే అందులోకి వెళ్లిపోయాడా? అల్లు అర్జున్ ను పుష్పరాజ్ కంట్రోల్ చేయటం మొదలైందా? దీనికి తోడు కలలో కూడా ఊహించని విజయాన్ని.. ఇమేజ్ ను సొంతం చేసుకున్న పుష్ప మూవీ పుణ్యమా అని.. అల్లు అర్జున్ లో ఆత్మవిశ్వాసం పెరటం తప్పు కాదు. కానీ.. ఆ పేరుతో రీల్ లో మాదిరి రియల్ లోనూ తాను అనుకున్నదే కరెక్టు అనుకోవటంలోనే సమస్య అవుతుందన్న విషయాన్ని ఆయన మర్చిపోయారా? అన్నది ప్రశ్న.
రీల్ లో పుష్ప క్యారెక్టర్ ను సింఫుల్ గా చెప్పాలనుకుంటే.. తనకు అస్సలు ఎదురు ఉండదని.. తానేం చేసినా అడ్డు వచ్చే వారెవరూ ఉండరని.. తనను ఎంతలా తొక్కే యాలనుకుంటే అందుకు రెట్టింపు బలంతో.. వేగంతో విరుచుకుపడే ఒక మోటు క్యారెక్టర్. ఇదే పాత్రలో కొన్ని మెరుపులు కూడా కనిపిస్తాయి. ఎత్తుకు ఎదిగే కొద్దీ తగ్గాలన్నది ఒకటైతే.. తాను చేసేది ఎదవి పని అన్న విషయం మీద అవగాహన.. తన చుట్టూ ఉన్నోళ్లంతా ఎదవలే అయినప్పుడు.. తాను మంచి ఎదవలా ఉండటం తప్పేం కాదన్నట్లుగా సినిమాలో పుష్పరాజ్ పాత్ర ఉంటుంది. దానికి తోడు డబ్బు కోసం ఏమైనా చేయొచ్చన్న ఫీలింగ్ ఆ పాత్రకు ఎక్కువ.
రీల్ వరకు ఓకే కానీ.. రియల్ లైఫ్ లో అలాంటివి సాధ్యం కావు. డబ్బులు ఎన్ని ఇచ్చినా సరే లొంగని నీతివంతులు.. అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకోవటానికి సిద్ధంగా ఉండే నిజాయితీపరులు ఎందరో. అంతేనా.. సినిమాలో డైరెక్టర్.. ప్రొడ్యుసర్.. హీరో చెప్పిందే ఫైనల్. వారు డిసైడ్ చేసిందే జరుగుతుంది తప్పించి మరొకటి జరగదు.కానీ.. రియల్ లైఫ్ లో అలా ఉండదు. కోట్లాది మంది ఉంటారు. ఒక సిస్టిం ఉంటుంది. ఒకటి జరిగితే దానికి ప్రతిగా ఎన్నో ఘటనలు ఒక గొలుసుకట్టు మాదిరి జరుగుతూ ఉంటాయి. ఈ విషయాన్ని అల్లు అర్జున్ మర్చిపోయినట్లున్నారు.
రీల్ పుష్ప ఆయన్ను బాగానే పట్టేసినట్లున్నారు. అదే లేకుంటే రియల్ అల్లు అర్జున్ అయితే రియలిస్టిక్ గా ఇంత వైల్డ్ గా రియాక్టు అయ్యే వారా? అన్నది ప్రశ్న. ఏది ఏమైనా.. ఇటీవల కాలంలో బన్నీ రియాక్షన్లు చూస్తున్నప్పుడు అతగాడిని పుష్ప బాగానే అవహించినట్లుగా కనిపిస్తోంది. ఆ పాత్ర నుంచి కాస్త బయటకు వస్తే మంచిది. పష్ప వాసన లేకుండా చూసుకోవటం అల్లు అర్జున్ కు ఇప్పుడు చాలా చాలా అవసరం. ఆ విషయాన్నినిన్న హైదరాబాద్ సీపీ ప్రెస్ మీట్ తర్వాత బాగానే అర్థమై ఉంటుంది.