అమెరికన్లకు మరో ఉపద్రవం... ఆందోళనలో ప్రజలు

పశువుల నుంచి మనుషులకు సోకే వ్యాధి బర్డ్ ఫ్లూ. ఇది గతంలో మనుషులను ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే

Update: 2024-03-28 05:11 GMT

పశువుల నుంచి మనుషులకు సోకే వ్యాధి బర్డ్ ఫ్లూ. ఇది గతంలో మనుషులను ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో మరోమారు బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. అమెరకాలోని టెక్సాస్, కాన్సాస్ తో పాటు పలు రాష్ట్రాల్లోని ఆవుల పాలలో బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉన్నాయనే వార్త అందరిలో భయాందోళనలు కలిగిస్తోంది. బర్డ్ ఫ్లూ సోకితే ఎలా అనే భయం అందరిలో కలుగుతోంది.

అమెరికాలోని వేల ఆవుల్లో హెచ్5ఎన్1 టైప్ ఎ బారిన పడ్డాయనే వార్త సంచలనం కలిగిస్తోంది. జంతువుల్లో ఈ స్థాయిలో వైరస్ దాడి చేయడం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని వైద్య వర్గాలు చెబుతున్నా ప్రజల్లో మాత్రం భయం పట్టుకోవడం సహజమే. ఈనేపథ్యంలో బర్డ్ ఫ్లూ వ్యాధి అక్కడి వారిని కలవరపరుస్తోంది.

వైరస్ సోకిన ఆవుల్లో ఆకలి మందగించడం, బద్ధకం వంటి లక్షణాలు కనిపిస్తాయట. దీంతో వాటిని గుర్తించి చికిత్స అందించాలి. లేకపోతే వ్యాధి ముదిరి అది కాస్త మనుషులకు సోకితే మరింత ప్రమాదకరమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో అమెరికాలో విస్తరిస్తున్న బర్డ్ ఫ్లూ నివారణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు.

బర్డ్ ఫ్లూ గురించి భయం పెరుగుతోంది. గతంలో వచ్చిన కరోనా వల్ల ప్రపంచం యావత్తు ఎంత ఆందోళన చెందిందో తెలిసిందే. అలా ఇప్పుడు బర్డ్ ఫ్లూ కూడా అదే రేంజ్ లో భయపెడితే ఎలా అనే ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే సాధ్యమైనంత వరకు దీన్ని నివారించాలని కోరుతున్నారు. ఇది వ్యాప్తి చెందకుండా తీసుకునే చర్యలపై ఆసక్తి చూపిస్తున్నారు.

బర్డ్ ఫ్లూ జంతువులతోనే సోకే వ్యాధి కావడంతో పెంపుడు జంతువుల పట్ల కూడా అప్రమత్తంగా ఉంటున్నారు. వాటికి టీకాలు వేయిస్తున్నారు. ఏ అనుమానం వచ్చినా వెంటనే చర్యలు చేపడుతున్నారు. అంత అగ్రరాజ్యమైనా బర్డ్ ఫ్లూ గురించిన జాగ్రత్తలు తీసుకుంటోంది. వ్యాధి తీవ్రతను పెరగకుండా చేసే చర్యలకు ఉపక్రమిస్తున్నట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News