వీడియో: విమానం రెక్కపై నిలబడిన ప్రయాణికులు... అసలేం జరిగింది?

ఇటీవల జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ తాజాగా అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది.;

Update: 2025-03-14 05:32 GMT

ఇటీవల కాలంలో జరుగుతోన్న పలు విమాన ప్రమాదాలు ప్రయాణికుల్లో తీవ్ర ఆందోళనలు కలిగిస్తున్నాయి. ఈ విషయంలో ఆ దేశం, ఈ దేశం అనే తారతమ్యాలేమీ లేవు! అగ్రరాజ్యం మొదలు అన్ని దేశాల్లోనూ పరిస్థితి ఇలానే ఉందని అంటున్నారు. ఈ ఏడాది అమెరికాలో వరుసగా జరిగిన ప్రమాదాలే ఇందుకు ఉదాహరణ. ఈ సమయంలో డెన్వర్ ఎయిర్ పోర్ట్ లో మరో ఘటన తెరపైకి వచ్చింది.

అవును... ఇటీవల జరుగుతున్న వరుస విమాన ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్న వేళ తాజాగా అమెరికాలోని డెన్వర్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఓ విమానానికి పెను ప్రమాదం తృటిలో తప్పింది. ఇందులో భాగంగా... విమానాశ్రయ గేటు వద్ద దిగిన విమానంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. దీంతో అప్రమత్తమైన సిబ్బంది ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారా ప్రయాణికులను బయటకు పంపించారు.

వివరాల్లోకి వెళ్తే... కొలరాడో స్ప్రింగ్స్ ఎయిర్ పోర్ట్ నుంచి డాలస్ ఫోర్ట్ వర్త్ కు బయలుదేరిన అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ సమయంలో ఇంజిన్ లో వైబ్రేషన్స్ మొదలవ్వడంతో వెంటనే విమానాన్ని డెన్వర్ కు మళ్లించి అత్యవసరంగా దించేశారు. అనంతరం... ఎయిర్ పోర్ట్ లోని టాక్సీయింగ్ ప్రదేశంలో విమానం ఇంజిన్ లో మంటలు తలెత్తాయి.

ఒక్కసారిగా విమానం దగ్దమవ్వడం మొదలైంది. దీంతో... అప్రమత్తమైన సిబ్బంది, ప్రయాణికులను ఎమర్జెన్సీ ఎగ్జిట్స్ ద్వారా బయటకు పంపించేశారు. ఘటన సమయంలో ఈ విమానంలో 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. ఈ సమయంలో.. అగ్నిమాపక సిబ్బంది సుమారు కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు. దీంతో... పెను ప్రమాదమే తప్పింది.

చూస్తుండగానే విమానమంతా దగ్ధమైంది. అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారాల నుంచి బయటకు తీసుకొచ్చారు. అదృష్టవశాత్తూ ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు వెల్లడించారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఘటన సమయంలో విమానంలో 172 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది కొన్ని గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.

ఈ సందర్భంగా స్పందించిన అధికారులు... అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ కలగలేదని అన్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. అమెరికా కాలమానం ప్రకారం గురువారం సాయంత్రం 5:15 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Tags:    

Similar News