వామ్మో.. అమిత్ షా ఆశ మామూలుగా లేదుగా?
తాజాగా జరిగిన హైదరాబాద్ శివారులో బీజేపీ రాష్ట్ర విస్త్రత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి అమిత్ షా హాజరయ్యారు
కేంద్ర హోం మంత్రి.. బీజేపీలో మోడీ తర్వాత అన్నీ తానై వ్యవహరించే అమిత్ షా తాజా మాటలు విన్నంతనే.. ‘ఆశ ఎక్కువ పీక సన్నన అన్న సామెత గుర్తుకు రావాల్సిందే. తెలంగాణలో అధికారం ఖాయమంటున్న ఆయన మాటల్లో మరో లెక్క తెర మీదకు వచ్చి కామెడీగా మారింది. ఎందుకంటే.. ఆయన లెక్కల్లో మరీ ఇంత వీక్ అన్న విషయంబయటపడటమే. లెక్కలే కాదు లాజిక్కు మిస్ అయిన అమిత్ షా.. ఆశ కంటే వాస్తవికతను పెంచుకుంటే మంచిదన్న హితవు సొంత పార్టీ నేతల నుంచి వస్తుండటం గమనార్హం.
తాజాగా జరిగిన హైదరాబాద్ శివారులో బీజేపీ రాష్ట్ర విస్త్రత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. దీనికి అమిత్ షా హాజరయ్యారు. ఈ సందర్భంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలవటం ఖాయమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన నోటి నుంచి వచ్చిన లెక్క.. కమలనాథుల్ని సైతం విస్మయానికి గురి చేసింది. అంత పెద్ద స్థాయిలో ఉన్న అమిత్ షా.. చిన్న అంశాల్ని మిస్ కావటమే కాదు.. ఆయన అంచనాలకు తగిన లాజిక్ లేకపోవటాన్ని ప్రశ్నిస్తున్నారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క ఎమ్మెల్యే గెలిస్తే.. ఐదేళ్లలో 8 స్థానాలకు పెరిగామని.. ఈసారి వచ్చిన 8 స్థానాల నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి బీజేపీ 95 స్థానాలకు పుంజుకుంటుందని పేర్కొన్నారు. ఒక స్థానం నుంచి 8 స్థానాలకు పెరిగిన వాస్తవం సరే. కానీ.. 8 స్థానాలు కాస్తా 95 స్థానాలకు ఎదగటం ఎలా? అన్నది ఎలా అనే విషయాన్ని ఆయన ఎక్కడా ప్రస్తావించకపోవటం గమనార్హం.
ఈ సందర్భంగా కొందరు కమలనాథులు కీలకమైన పాయింట్ ను ప్రస్తావిస్తున్నారు. గెలిచిన సీట్లకు అమిత్ షా ఇంత ధీమా ప్రదర్శిస్తున్నారని.. కానీ బండి సంజయ్ ను టీబీజేపీ అధ్యక్షుడిగా ఉంచి ఉంటే.. ఈ మధ్యనే ముగిసిన ఎన్నికల్లో డబుల్ డిజిట్ ఖాయమయ్యేదని.. కాంగ్రెస్ చేతికి అధికారం వచ్చేది కాదన్న విషయాన్ని అమిత్ షా ఎలా మిస్ అయ్యారని ప్రశ్నిస్తున్నారు. పార్టీ అంతర్గత కుమ్ములాటల గురించి పట్టించుకోని అమిత్ షా.. గెలిచే సీట్ల మీద చేస్తున్న వ్యాఖ్యలు చేతిలో కత్తి లేకుండానే యుద్ధానికి వెళ్లమన్న చందంగా ఉందంటున్నారు.
మరో మూడు నాలుగు నెలల్లో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 10స్థానాల్లో విజయం సాధించామని.. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో 35 శాతం ఓట్ల షేర్ లక్ష్యమన్న ఆయన.. కేడర్ తో తెలంగాణలో 10 లోక్ సభ సీట్లు గెలిచేసే చేస్తామన్న మాటను ప్రతిజ్ఞ చేయించటం విశేషం. ఇలాంటివి చేసే కన్నా.. రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని అత్యవసరంగా ప్రక్షాళన చేయాలన్న వాస్తవాన్ని ఆయన ఎలామిస్ అవుతున్నట్లు? అన్నది అసలు ప్రశ్నగా చెప్పక తప్పదు.