ఏపీకి మరో ఘనత జపాన్ పెట్టుబడులు!
ఏపీని గాడిలో పెడుతున్నామని చెబుతున్న సీఎం చంద్రబాబు.. ఈ పరంపరలో మరో ఘనత సాధించారు.;

ఏపీని గాడిలో పెడుతున్నామని చెబుతున్న సీఎం చంద్రబాబు.. ఈ పరంపరలో మరో ఘనత సాధించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్న సంస్థలను సాదరంగా స్వాగతిస్తున్నారు. తాజాగా ప్రపం చంలో అత్యంత వేగంగా దూసుకుపోతున్న జపాన్‌తో చర్చలు జరిపారు. జపాన్ పెట్టుబడులను ఆశించారు. దీనికి జపాన్ కూడా.. అంగీకరించింది. భారత దేశంలో జపాన్ రాయబారి కైచి ఒనో.. తాజాగా తన ప్రతినిధి బృందంతో సీఎం చంద్రబాబును కలిశారు.
ఈ సందర్భంగా.. జపాన్ పెట్టుబడుల వ్యవహారం తెరమీదికి వచ్చింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందు కు ఉన్న అవకాశాలు.. మార్గాలు.. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సహం ఇలా.. అన్ని విషయాలు చర్చకు వచ్చాయి. ఇప్పటికే చాలా కంపెనీలు ఏపీకి వచ్చాయని.. త్వరలోనే మరిన్ని రానున్నాయని చంద్రబాబు వివరించారు. ఈ సందర్భంగా పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు జపాన్ సైతం అంగీకరించింది. త్వరలోనే వాటిలో పెట్టుబడులు పెట్టనున్నట్టు తెలిసింది.
ఇవీ.. జపాన్ పెట్టుబడులు పెట్టే రంగాలు..
1) నౌకా నిర్మాణం
2) ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీ
3) రసాయనాల ఉత్పత్తులు
4) జపనీస్ భాష నేర్పించండం
ఈ అంశంపై సీఎం చంద్రబాబు తాజాగా ఎక్స్‌లో పోస్టు చేశారు. జపాన్ రాయబారి కైచి ఒనోతో సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని తెలిపారు. ఏపీలో జపాన్ పెట్టుబడులు, ఆర్థిక సంబంధాలపై చర్చించామన్నారు. కొత్త అవకాశాలు, పెట్టుబడులపై జపాన్ ఏపీలో పెట్టేబడులు పెట్టేందుకు ఉత్సాహంగా ఉందని పేర్కొన్నారు. జపనీస్ నేర్పించేందుకు, అంతర్జాతీయ విద్యా రంగాల్లో పరస్పర సహకారంపై చర్చించామని సీఎం తెలిపారు.