ఏపీ రాజధాని అమరావతి గురించి.. 'ఏఐ'ని అడిగితే.. 'చిత్రం' చూపించింది!
దీంతో అమరావతి ప్రయాణం ఇక పట్టాలెక్కడం ఖాయమని అందరూ విశ్వసిస్తున్నారు.
ఏపీ కలల రాజధాని అమరావతి గురించి.. సర్వత్రా చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. గత ఐదేళ్ల జగన్ పాలనలో భ్రష్టు పట్టిన నవ్యాంధ్ర రాజధానికి.. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడడంతోనే ఊపిరిలూదినట్టు అయింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే చంద్రబాబు అమరావతిలో పర్యటించారు. పనులను పరిశీలించారు. తక్షణం గ్రీనరీ పెంచాలని.. చిరు వ్యాపారాలు చేసుకునేవారిని ప్రోత్సహించి.. ఉత్సాహభరిత వాతావరణం ఉండేలా ఏర్పాట్లు చేయాలని కూడా ఆయన సూచించారు. దీంతో అమరావతి ప్రయాణం ఇక పట్టాలెక్కడం ఖాయమని అందరూ విశ్వసిస్తున్నారు.
+ ఈ నేపథ్యంలో కొందరు ఔత్సాహిక నెటిజన్లు.. కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఏఐ)ను అమరావతి గురించి ప్రశ్నించారు. అమరావతి ప్రగతి ఎలా ఉంటుందని అడగ్గా.. ''వెరీ సూపర్'' అని సమాధానం ఇచ్చింది.
+ 2047(దేశానికి స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు) నాటికి ఏపీ రాజధాని అమరావతి రూపు రేఖలు ఎలా ఉంటాయన్న ప్రశ్నకు సమాధానంగా అప్పటికి అమరావతిలో విశాలమైన ఆరులైన్ల రోడ్లు, వాటి పక్కన భారీ బహుళ అంతస్థలు భవనాలు ఉంటాయని AI తెలిపింది.
+ అమరావతిలో రైల్వే వ్యవస్థ ఎలా ఉంటుంది అనే ప్రశ్నకు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాస్త కొత్తగా ఆలోచించింది. రైల్వేస్టేషన్‌కి ఎర్ర కోట లుక్ ఇచ్చింది. వందే భారత్ మోడల్లో మరింత అధునాతనంగా ఉన్న రైలు చిత్రాన్ని ప్రదర్శించింది.
+ ఏపీలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (IT) రంగం 2047 నాటికి ఎలా అభివృద్ధి చెందుతుందన్న ప్రశ్నకు.. అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించింది. కళ్లు మిరిమిట్లు గొలిపే టవర్స్‌తోపాటు గ్లోబు ఆకారంలో ఉన్న భారీ నిర్మాణాన్నిచిత్రంలో చూపింది.
+ అమరావతికి కూతవేటు దూరంలో ఉన్న విజయవాడ 2047 నాటికి ఎలా ఉంటుందన్న ప్రశ్నకు స్పందిస్తూ.. విజయవాడ సిటీ కూడా బాగా డెవలప్ అవుతుందని AI తెలిపింది. అలాగే.. ఆలయాలు కూడా అధునాత హంగులతో ఉంటాయని ఫొటోలను రూపొందించి.. కనుల విందు చేసింది.