6 ఏళ్ల క్రితం థమన్ కి అనుష్క ఇచ్చిన మాట కోసం...!
టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు విజయశాంతి తర్వాత ఆ స్థాయి గుర్తింపు, సక్సెస్ లను తెచ్చి పెట్టిన హీరోయిన్ అనుష్క అనడంలో సందేహం లేదు.
టాలీవుడ్ లో లేడీ ఓరియంటెడ్ సినిమాలకు విజయశాంతి తర్వాత ఆ స్థాయి గుర్తింపు, సక్సెస్ లను తెచ్చి పెట్టిన హీరోయిన్ అనుష్క అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా ఆమె బాహుబలి తర్వాత పాన్ ఇండియా రేంజ్ లో మంచి గుర్తింపును దక్కించుకుంది. ఆ సినిమా తర్వాత బాలీవుడ్ లోనూ వరుస సినిమాలు చేస్తుందని అంతా భావించారు. కానీ ఆమె సినిమాలు చాలా తగ్గించింది. స్లో అండ్ స్టడీ అన్నట్లు అనుష్క సినిమాలు చేస్తూ వస్తోంది. అనుష్క చివరగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించిన విషయం తెల్సిందే. ఆమె తదుపరి సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
తాజాగా అనుష్క గురించి తెలుగు ఇండియన్ ఐడల్ లో థమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రముఖ ఓటీటీ ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న తెలుగు ఇండియన్ ఐడల్ షో లో ఒక కంటెస్టెంట్ అనుష్క పాట పాడిన సమయంలో థమన్ మాట్లాడుతూ... ఒక నటిగానే కాకుండా మనిషిగా అనుష్క గారు చాలా గొప్ప వ్యక్తి. ఆమె నాకు లైఫ్. ఆమె అంటే నాకు చాలా ఇష్టం. అందం విషయంలోనే కాకుండా ప్రతి విషయంలోనూ ఆమె ది బెస్ట్. ప్రతి సంవత్సరం నాకు సెప్టెంబర్ లో అనుష్క గారి నుంచి ఐ ఫోన్ గిఫ్ట్ గా వస్తుంది. ప్రస్తుతం చేతిలో ఉన్న ఈ ఫోన్ కూడా అనుష్క గారు నాకు బహుమానంగా పంపించిందే అన్నాడు.
ఆరు సంవత్సరాల క్రితం అనుష్క హీరోయిన్ గా నటించిన భాగమతి సినిమా విడుదల అయింది. ఆ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించాడు. సినిమా ప్రమోషన్ సమయంలో ఒక సారి అనుష్క, థమన్ చిట్ చాట్ చేస్తున్న సమయంలో.. భాగమతి సినిమా హిట్ అయితే ప్రతి సంవత్సరం నీకు ఐఫోన్ కొత్త వర్షన్ గిఫ్ట్ గా ఇస్తానంటూ అనుష్క హామీ ఇచ్చారు. అన్నట్లుగానే, ఆమె మాట మీద నిలబడి భాగమతి సినిమా హిట్ నేపథ్యంలో ఆరు సంవత్సరాలుగా వరుసగా సెప్టెంబర్ లో నాకు కొత్త ఐ ఫోన్ ను బహుమానంగా పంపిస్తున్నారు. ఏదో చిట్ చాట్ లో అన్న మాట పై నిలబడి ప్రతి సంవత్సరం లక్ష కు పైగా విలువ చేసే ఐఫోన్ ను అనుష్క ఇస్తుందంటే ఆమె గొప్పతనం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
అనుష్క త్వరలో భాగమతి 2 సినిమా తో వస్తుందని కూడా సంగీత దర్శకుడు థమన్ చెప్పుకొచ్చాడు. ఇటీవలే అందుకు సంబంధించిన కథ ఫైనల్ అయిందని, త్వరలో స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి అయితే అనుష్క షూటింగ్ కి జాయిన్ అవ్వబోతున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అనుష్క సినిమాలు వరుసగా చేయకున్నాడు, ఏళ్లకు ఏళ్లు గ్యాప్ వచ్చినా ఆమె పై అభిమానం మాత్రం తగ్గడం లేదు. అనుష్క ఎప్పుడు సినిమా చేస్తుంది, ఎప్పుడు చూద్దామా అని అంతా కాచుకుని ఎదురు చూస్తున్నారు. ముందు ముందు అనుష్క స్పీడ్ గా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ అనుష్క మాత్రం స్పీడ్ పెంచే ఉద్దేశ్యం లేనట్లుగా వ్యవహరిస్తోంది.