పవన్ కు పురందేశ్వరి ఫోన్... జనసేన మిత్రపక్షమే!

బీజేపీ మిత్రపక్షం జనసేన... పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు!

Update: 2023-07-20 03:54 GMT

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో పొత్తుల వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చిందని తెలుస్తుంది. మరి ముఖ్యంగా హస్తినలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశానికి ఏపీ నుంచి జనసేనకు మాత్రమే ఆహ్వానం రావడంతో పొత్తు చర్చ మరింత ఆసక్తిగా మారింది. ఈ సమయంలో స్పందించిన పురందేశ్వరి... కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది.

తనకు ఢిల్లీ పెద్దలతో తప్ప.. రాష్ట్ర బీజేపీ నాయ‌కుల‌తో పెద్దగా సంబంధాలు లేవ‌ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌దేప‌దే చెబుతుంటారని అంటుంటారు. ఇదే సమయంలో బీజేపీ - జ‌న‌సేన క‌లిసి రాష్ట్రంలో ఎక్కడా ఎలాంటి కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొన్న సందర్భం లేదనేది తెలిసిన సంగతే. ఒక్క తిరుప‌తి ఉపఎన్నిక‌ల్లో తప్ప.. ఆ త‌ర్వాత రెండు పార్టీలు క‌లిసి నిర్వహించిన కార్యక్రమాలు కూడా లేవని అంటుంటారు.

ఇదే సమయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా జనసేన తమకు మద్దతుగా నిలవలేదని పలువురు బీజేపీ నేతలు వ్యాఖ్యానించినట్లు కథనాలొచ్చాయి. ఈ సమయంలో జనసేనపై పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారని తెలుస్తుంది. జ‌న‌సేన త‌మ‌కు మిత్రపక్షమని.. ఆపార్టీతో ఇక‌పై రెగ్యుల‌ర్ గా సంప్రదింపులు, ఉమ్మడి కార్యాచ‌ర‌ణ కూడా ఉంటుంద‌ని పురంధేశ్వరి స్పష్టంచేశారని సమాచారం.

ఇదే సమయంలో... ఏపీ బీజేపీ చీఫ్ గా బాధ్యతలు చేప‌ట్టిన త‌ర్వాత.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో ఫోన్లో మాట్లాడాన‌ని పురంధేశ్వరి చెప్పినట్లు తెలుస్తుంది. ఇదే క్రమంలో త్వరలో నేరుగా భేటీ అవుతామని అన్నారని సమాచారం. దీంతో... ఇకపై ఏపీలో బీజేపీ - జనసేనల మధ్య పొత్తు క్రియాశీలకంగా మారబోతుందని అంటున్నారు పరిశీలకులు.

మరోపక్క... పవన్ కల్యాణ్ హస్తినలో జాతీయ మీడియాతో మాట్లాడిన సందర్భంగా... టీడీపీ - జనసేన - బీజేపీ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే! అయితే పురందేశ్వరి మాత్రం టీడీపీకి వైసీపీకి స‌మ‌దూరంలో త‌మ పార్టీ ఉంటుంద‌ని.. జ‌న‌సేన‌తో మాత్రం పొత్తు కొన‌సాగుతుంద‌ని నొక్కి వక్కానిస్తున్నారని తెలుస్తుంది.

ఇదే సమయంలో ఏపీ అప్పులపై కూడా పురందేశ్వరి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీపై విభజన నాటికి రూ.97వేల‌ కోట్ల భారం ఉందని.. ఐదేళ్ల టీడీపీ పాలనలో‌ రూ.2,65,365 కోట్లు అప్పు చేశారని.. నలభై వేల కోట్లు కాంట్రాక్టర్‌ లకు బిల్లులు చెల్లించలేదని అన్నారని తెలుస్తుంది. ఇక, వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి జులై వరకు నాలుగేళ్లల్లో రూ.7,14,631 కోట్లు అప్పు చేశారని ఆమె అన్నారని సమాచారం.

ఇదే సమయంలో బెంగళూరులో జరిగిన విపక్షాల "ఇండియా" కూటమిపై పురందేశ్వరి ఆసక్తికరంగా స్పందించారని అంటున్నారు. విభిన్న సిద్దాంతాలు కలిగిన పార్టీల సమూహమే విపక్షాల కొత్త కూటమి అని ఆమె అన్నారన్ని తెలుస్తుంది.

ఏది ఏమైనప్పటికీ... ఏపీలో ఇకపై బీజేపీ - జనసేనల ఉమ్మడి కార్యక్రమాలు ఉంటాయా... లేక, పురందేశ్వరి వ్యాఖ్యలు మాటలవరకే పరిమితం అవుతాయా అనేది వేచి చూడాలని అంటున్నారు పరిశీలకులు.

Tags:    

Similar News