జగన్ ఒక లేట్ మాస్టర్...అవునా ?

రాజకీయాల్లో ఒక టైం టైమింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సరిగ్గా సమయం చూసుకుని చేసే కామెంట్స్ కి ఎంతో విలువ ఉంటుంది.;

Update: 2025-03-27 13:30 GMT
జగన్ ఒక లేట్ మాస్టర్...అవునా ?

రాజకీయాల్లో ఒక టైం టైమింగ్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. సరిగ్గా సమయం చూసుకుని చేసే కామెంట్స్ కి ఎంతో విలువ ఉంటుంది. మైలేజ్ కూడా వాటికే ఉంటుంది. ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎపుడూ ముందుంటారు. ఆయన పొలిటికల్ టైమింగ్ వేరే లెవెల్ అని అంటారు.

జగన్ విషయానికి వస్తే ఆయన తక్కువగా మీడియాతో టచ్ లోకి వస్తారు. సోషల్ మీడియాను సైతం ఆయన పెద్దగా ఉపయోగించుకోరని అంటారు. ఈ రోజుల్లో పాలిటిక్స్ ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. తెల్లారి లేస్తే ఆర్ధ రాత్రి దాకా సోషల్ మీడియాలోనే వార్ సాగుతూ ఉంటుంది. అవసరం అయితే మూడు ప్రెస్ మీట్లు ఆరు సోషల్ మీడియా ట్వీట్లు అన్నట్లుగా అగ్ర నేతలు తీరిక లేని పాలిటిక్స్ చేస్తేనే తప్ప జనాల్లోకి ఆయా పార్టీల స్టాండ్ కానీ వాదన కానీ ఎంతో కొంత రిజిస్టర్ కావడంలేదు.

అటువంటిది వైసీపీ మాత్రం చాలా విషయాలను అలా లైట్ తీసుకుని వదిలేస్తూ ఉంటుంది. టీడీపీ కూటమి సర్కార్ కి కౌంటర్ చేయాలీ అంటే అంశాలు వెతికి పట్టుకోవాలి. బలమైన అపొజిషన్ మీడియాను దాటి ముందుకు వెళ్ళాలి. అలాంటిది ఆ వైపు నుంచే స్కోప్ ఇస్తూంటే దానిని కూడా వాడుకోకపోవడం అంటే నిజంగా అది వైసీపీ స్ట్రాటజీ మిస్టేకే అని చెప్పాల్సి ఉంటుంది అని అంటున్నారు.

ఇదంతా ఎందుకు అంటే కడప జిల్లా బద్వేల్ లో ని కాశీనాయన ఆశ్రమం గురించే. దాని మీద అంతా అయ్యాక జగన్ చాలా లేటుగానే రియాక్ట్ అయ్యారని అంటున్నారు. ఆయన తాజాగా ఎక్స్ వేదికగా చాలా సుదీర్ఘమైన వివరణలు విమర్శలు చేస్తూ కూటమిని ప్రభుత్వాన్ని కార్నర్ చేశారు. అందులో తమ ప్రభుత్వం కాశీనాయన ఆశ్రమాన్ని కాపాడడానికి ఎలాంటి ప్రయత్నాలు చేసిందో కూడా ఆయన చెప్పారు.

మరి ఇదే విషయం ఆయన ఆశ్రయం కూలిన వెంటనే చెప్పి ఉంటే ఆ కిక్కే వేరే లెవెల్ లో ఉండేది అని అంటున్నారు. తాము ఆశ్రమాన్ని కాపాడేందుకు ప్రయత్నం చేశామని కానీ కూటమి కూల్చేసింది అని నాడే జగన్ అన్ని వివరాలు బయటపెట్టి ఉంటే ఆధ్యాత్మిక పరులలో కూటమి మీద కలిగిన ఆవేశం కాస్తా వైసీపీ వైపు సాఫ్ట్ కార్నర్ గా మారి ఉండేది. లడ్డూల కల్తీ విషయంలో ఇబ్బంది పడిన వైసీపీకి ఇది పెద్ద బూస్టింగ్ గా మారేది.

కానీ ఎందుకో అన్నీ తెలిసినా జగన్ సహా వైసీపీ నేతలు ఎవరూ ఈ ఇష్యూని పెద్దగా పట్టించుకోలేదు. అంతలోనే కూటమి సర్కార్ సర్దుకుంది. నారా లోకేష్ చాలా లౌక్యంగా సౌఖ్యంగా వ్యవహారాన్ని డీల్ చేశారు. మూడు రోజులలో ఆయన కూల్చిన వాటిని నిర్మిస్తామని చెప్పి మాట దక్కించుకున్నారు దాంతో నెగిటివ్ అవుతుంది అనుకున్నది కాస్తా పాజిటివ్ గా మారింది.

అలా కూటమి సర్కార్ పెద్దలు ఈ ఇష్యూలో మొదట ఇరకాటంలో పడినా తరువాత బాగానే బయటపడ్డారు. కానీ నాడు అన్నీ లైట్ తీసుకుని ఇపుడు తాపీగా కూటమి మీద విమర్శలు చేసినా ఫలితం ఉంటుందా అన్న చర్చ అయితే సాగుతోంది. ప్రతీ ఇష్యూని తీసుకోవాలి. అందులో తప్పులు ఉంటే ఎండగట్టాలి. ఏ మాత్రం లేట్ అయినా విషయం కాస్తా మారిపోతుంది.

సోషల్ మీడియా యుగంలో జనాలకు ఎన్నో కొత్త అంశాలు కళ్ళ ముందుకు వస్తున్నాయి. మరి బర్నింగ్ టాపిక్స్ ని పట్టుకుని వైసీపీ దూకుడుగా పాలిటిక్స్ చేస్తేనే రాణింపు అని అంటున్నారు. అలా కాకుండా తీరిక అయినపుడు కానీ లేదా ఎవరైనా గుర్తు చేస్తే రియాక్ట్ అవుతామని అనుకుంటే మాత్రం ఇబ్బందే అని అంటున్నారు అంతా.

Tags:    

Similar News