టఫ్ కాస్తా.. లైట్ అయితే... ఏం జరుగుతుంది?
గత 2019లోనూ ఇలానే అనుకున్నారు. ఇంకేముంది.. టఫ్ అన్నారు.
ఏపీలో జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే.. టఫ్ ! అనే మాట జోరుగా వినిపించింది. ఏ ఇద్దరు మాట్లాడుకున్నా .. అమ్మో.. చాలా టఫ్ పైట్ అంటున్నారు. కొన్ని మీడియాసంస్థలు కూడా.. ఇదే చెబుతున్నాయి. ఇక, పరిశీలకులు కూడా ఇదే అంచనా వేస్తున్నారు. ఏపీలో ఎవరూ ఊహించనంత టఫ్ ఫైట్ సాగిందని అంటున్నారు. అయితే.. ఒక్కొక్కసారి టఫ్ అనుకున్నదల్లా జరగాలని ఏమీ లేదు. గత 2019లోనూ ఇలానే అనుకున్నారు. ఇంకేముంది.. టఫ్ అన్నారు.
ఎన్నికల సమయానికి చంద్రబాబు పసుపు కుంకుమ పంచడం.. జగన్ ప్రజాసంకల్ప యాత్ర వంటివి ప్రభావం చూపిస్తున్నాయని.. కాబట్టి ఈ ఎన్నికలను అంచనా వేయడం అంత ఈజీ కాదని చాలా మంది విశ్లేషించారు. అయితే.. నిజానికి 2019 టఫ్ గా కనిపించినా.. ఏకపక్షంగానే ముగిసింది. చివరకు ఫలితం చూస్తే.. వైసీసీ క్లీన్ స్వీప్ చేసింది. ఎవరూ ఊహించని విధంగా.. ఎవరూ అంచనా వేయలేని విధంగా కూడా.. వైసీపీ 151 సీట్లు తెచ్చుకుంది.
అంటే.. 2019లో టఫ్. టఫ్.. అనుకున్న ఎన్నిక కాస్తా.. లైట్ అయిపోయింది. ఇదే ఫార్ములా ఇప్పుడు ఇక్క డ ఎందుకు వర్తించదనేది ప్రశ్న. ఐదేళ్లు జగన్ పాలన చూశారు. కాబట్టి.. మరోసారి ఆయనను గెలిపించా లని అనుకునేవారు ఉన్నారో.. లేదో తెలియదు. ఇంకోవైపు కూటమి పోటెత్తింది. మూడు పార్టీలూ కలిశాయి. ప్రచారాన్ని దంచి కొట్టాయి. మోడీ సహా కేంద్ర మంత్రులు కూడా ఇక్కడ ప్రచారం చేశారు. సమస్యలు ప్రస్తావించారు. పరిష్కారం చూపిస్తామన్నారు.
ఇలా చూసుకున్నప్పుడు.. కూటమి వైపు ఎందుకు ప్రజలు ఏకపక్షంగా మొగ్గు చూపించరనేది ప్రశ్న. పైగా చంద్రబాబు వస్తే.. బస్సుల్లో ఉచిత ప్రయాణం.. నెలనెలా రూ1500 పంపిణీ.. వంటివి మహిళల్లోకి వెళ్లాయి. దీంతో ఈ ఎన్నిక టఫ్ కాదని.. ఏకపక్షంగానే సాగి ఉంటుందని కొందరు అంచనా వేస్తున్నారు. కేంద్రంలో అయినా.. రాష్ట్రాల్లో అయినా.. టఫ్ అని అనుకున్నప్పుడల్లా.. ప్రజలు ఏకపక్షంగా తీర్పు చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు.