చంద్రబాబు జగన్ నెత్తిన పాలు పోస్తారా...?

జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అధికారంలో ఉన్న వారు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు.

Update: 2023-08-27 17:23 GMT

జగన్ వచ్చే ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారు. అధికారంలో ఉన్న వారు ఎవరైనా అలాగే ఆలోచిస్తారు. ఇక జగన్ సీఎం కాక ముందు నుంచే ముప్పయ్యేళ్ళ పాటు సీఎం అని బిగ్ సౌండ్ చేస్తూ వచ్చారు. దాంతో ఆయన పట్టుదల ఎంత అన్నది తెలిసిందే. మరో వైపు చూస్తే ఏపీలో జగన్ ట్రెడిషన్ కి భిన్నంగా కేవలం సంక్షేమం మీదనే పాలన చేస్తున్నారు. నగదు బదిలీ ద్వారా ప్రతీ ఇంటికీ లక్షల రూపాయలు గడచిన నాలుగున్నరేళ్ల కాలంలో

చేరవేశారు.

ఈ నేపధ్యంలో జగన్ సంక్షేమానికి విపక్షాల సంక్షేమానికి మధ్యనే సమరం సాగనుంది. ఇది సిద్ధాంతం ప్రకారం అయితే రాజకీయంగా చూస్తే పొత్తులు ఎంతో ప్రాధాన్యత వహిస్తాయి. ఏపీలో టీడీపీ బలంగా ఉన్నా ఒంటరిగా పోటీ చేస్తే ఓట్ల చీలిక తప్పదు. అదే టైం లో ఎవరితో కలవాలి అన్నది మరో చర్చ.

చంద్రబాబుకు అయితే జనసేన బీజేపీలతో కలవాలని ఉందని అంటారు. లేటెస్ట్ గా ఇండియా టు డే సీ ఓటర్ సర్వే నివేదికలో కూడా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తుందని తేల్చి చెప్పింది. మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీతో జట్టు కడితేనే లాభం అని ఎవరైనా అనుకుంటారు.

అందునా రాజకీయంగా చాణక్యుడు అయిన చంద్రబాబు కూడా అలాగే ఆలోచిస్తారు అని అంటున్నారు. అయితే చంద్రబాబు ఆలోచన తప్పు అంటున్నారు ఎర్ర మిత్రుడు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామక్రిష్ణ మాట్లాడుతూ బీజేపీతో జట్టు కడితే మాత్రం చంద్రబాబు ఓడిపోవడం ఖాయమని ముందే అపశకునం పలికేశారు.

బీజేపీ అంటే ఏపీలో తీవ్ర వ్యతిరేకత ఉందని, పైగా ఆ పార్టీ విభజన హామీలను ఏవీ అమలు చేయలేదని ఆయన అంటున్నారు. అలాంటి బీజేపీతో చేతులు కలిపిన ఏ పార్టీ అయినా ఓటమిపాలు కావాల్సిందే అంటున్నారు. అంతే కాదు జగన్ నెత్తిన పాలు పోసినట్లే అని కూడా హెచ్చరించారు.

ఏపీలో మళ్లీ జగన్ అధికారంలోకి రావాలంటేనే బీజేపీతో బాబు పొత్తు పెట్టుకోవాలని కూడా అంటున్నారు. అలా అంటూనే చంద్రబాబు అంత అమాయకంగా ఉండరని ఆయనకు అన్నీ తెలుసు అని అంటున్నారు. ఏపీలో జనసేన టీడీపీ కామ్రేడ్స్ పొత్తు ఉంటే అది సూపర్ హిట్ అవుతుంది అని కూడా రామక్రిష్ణ అంటున్నారు.

ఈ పొత్తులు కుదుర్చుకోండి బాబూ అని కూడా చెబుతున్నారు. సరే ఎర్రన్న ఆలోచనలు అలా ఉన్నా కూడా చంద్రబాబు బీజేపీని వదిలేసి కామ్రేడ్స్ వైపు వస్తారా అన్నది పెద్ద డౌట్. ఎందుకంటే ఎన్నికల వేళ కేంద్రం అండగా ఉండడం అవసరం అన్నది బాబుకు తెలియనిది కాదు అని అంటున్నారు. 2019లో అలా బీజేపీతో వైరం పెట్టుకుని ఓటమి పాలు అయ్యామని ఆయన చింతిస్తున్నారు అని అంటున్నారు.

ఇపుడు ఆ తప్పు అసలు చేయనే చేయరని కూడా అంటున్నారు దాంతో ఏపీలో పొత్తుల విషయంలో బాబు ఎటు వైపు వెళ్తారు అన్నది అయితే సందేహంగానే ఉంది అని అంటున్నారు. బీజేపీతో పొత్తు కావాలి. అయితే ఆ పార్టీ పట్ల వ్యతిరేకత ఉంటే అది టీడీపీకి చుట్టుకుంటుందా అన్నది కూడా మరో డౌట్ గా ఉంది అంటున్నారు.

ఇక జనసేన విషయం తీసుకుంటే ఆ పార్టీ బీజేపీతో ఇప్పటికే పొత్తులో ఉంది. బీజేపీతో ఉంటేనే టీడీపీ నుంచి ఎక్కువ సీట్లను డిమాండ్ చేయగలమని జనసేన భావిస్తోంది. అలా కాకుండా కామేడ్స్ తో వెళ్తే వారికి ఒక పది జనసేనకి ఒక పాతిక సీట్లను టీడీపీ ఇచ్చేసి సరి అనిపిస్తుందని కూడా జనసేన ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. ఏది ఏమైనా కూడా ఏపీలో పొత్తుల విషయం ఇంకా ఒక కొలిక్కి అయితే రావడంలేదు. బహుశా అయిదు రాష్ట్రాల ఎన్నికల తరువాత చంద్రబాబు తన రాజకీయ మంత్రాంగం ఏంటో బయటపెడతారు అని అంటున్నారు.

Tags:    

Similar News