గమనించారా?... ఏపీ రాజకీయాల్లో 'ఆ' మాటలు మాయం!

సరిగ్గా గమనిస్తే ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ రాజకియ విమర్శలు ప్రతివిమర్శల్లో బూతులు మాయమైపోయాయి

Update: 2024-08-21 05:38 GMT

సరిగ్గా గమనిస్తే ఏపీ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచీ రాజకియ విమర్శలు ప్రతివిమర్శల్లో బూతులు మాయమైపోయాయి. మంత్రులు, అధికార పార్టీ నేతలు ప్రెస్ మీట్లు పెట్టినా సబ్జెక్ట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నారు.. ఈ క్రమంలో గత ప్రభుత్వ హయాంలోని తప్పులను ఎత్తిచూపుతున్నారు. రాజకీయ, పరిపాలనకు సంబంధించిన వ్యాఖ్యలు మాత్రమే చేస్తున్నారు.

అవును... ఏపీ రాజకీయాల్లో మంత్రులు, నేతలు ప్రెస్ మీట్లు పెడితే ఇప్పుడు "బీప్స్" వేయాల్సిన అవసరం మీడియా ఛానల్స్ కు లేదు. వీలైనంతలో హుందాగానే నేతల వ్యాఖ్యలు, విమర్శలు, స్టేట్ మెంట్లూ ఉంటున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వ నేతలు, ఇప్పటి ప్రతిపక్ష సభ్యులు, మాజీలు కూడా ఎక్కడా నోరు జారడం లేదు.. పరుష పదజాలం ఉపయోగించడం లేదు.

ఇటీవల పలువురు మాజీ మంత్రులు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శైంచినా, ప్రభుత్వ పెద్దలపై ఫైర్ అయినా... మాటకు ముందు ఒకసారి, మాట తర్వాత ఓ సారి "గారు" అని సంబోధిస్తున్న పరిస్థితి. వీలైనంత వరకూ వంకర మాటలు, ద్వంద్వార్ధ ప్రయోగాలు, బూతు మాటలు, బీప్ పదాలూ వాడటం లేదు. ఎవరి జాగ్రత్తలో వారు ఉంటున్నారు. యదా రాజా తదా ప్రజా అన్నట్లు!

అయితే.. ఒకసారి గతానికి వెళ్తే... వైసీపీ ప్రభుత్వంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు.. ప్రతిపక్ష నేతలను విమర్శించాల్సి వచ్చినప్పుడు ఘాటు పదాలు ఉపయోగించేవారు. రాయడానికి ఇబ్బంది అయినా.. ప్రస్థావించాల్సిన అవసరం ఉండటంతో చెప్పాల్సి వస్తుందని అనుకుంటే... "నీయమ్మ మొగుడు", "దత్తపుత్రుడు", "పప్పు, తుప్పు", "మ్యారేజ్ స్టార్" మొదలైన మాటలు అనేవారు.

ఇక నాటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ సైతం తన సిద్ధం సభల్లో చంద్రబాబును "చంద్రముఖి" అని సంభోదించేవారు.. "పెళ్లిల్లు - పెళ్లాలు" వంటి ప్రస్థావనలు తెచ్చేవారు. అయితే ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన అనంతరం ఆ తరహా మాటలు ఏ వైపు నుంచీ వినిపించడం లేదు. ఇది కచ్చితంగా ఆహ్వానించదగ్గ పరిణామం అనే చెప్పాలి.

Tags:    

Similar News