యాపిల్ సంచలన నిర్ణయం... అక్టోబర్ 1 నుంచి యూజర్లకు షాక్ !
మరోవైపు ఈ నెల 12న ఈ ఏడాది మెగా ఈవెంట్ ను నిర్వహించనుంది యాపిల్. ఇందులో భాగంగా... ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది
టెక్ దిగ్గజం యాపిల్ సరికొత్త నిర్ణయం ప్రకటింతో యూజర్లకు షాక్ ఇవ్వనుంది. ఈ నెల 12 న కొత్త ఐఫోన్ - 15 లాంచ్ అవుతుందనే ప్రకటనల నేపథ్యంలో... ఆ ఫోన్ లాంచ్ అయిన మరో మూడు వారాల్లో ఈ కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఇది కచ్చితంగా యూజర్లకు షాకింగ్ న్యూసే అనేది కామెంట్!
అవును... టెక్ దిగ్గజం యాపిల్ సంస్థ సరికొత్త నిర్ణయంతో తన యూజర్లకు షాక్ ఇవ్వనుందని తెలుస్తుంది. ఇందులో భాగంగా... సోషల్ మీడియాలో కస్టమర్ సపోర్ట్ ని నిలిపివేయనుంది. అంటే... యూట్యూబ్, ట్విటర్, సపోర్ట్ కమ్యూనిటీ ఆన్ లైన్ ఫోరంలకు చెక్ పెట్టనుందన్నమాట.
ఇదే క్రమంలో సోషల్ మీడియా సపోర్ట్ అడ్వైజర్ లను తొలగించాలని యోచిస్తోంది! అంటే... ఇకపై కస్టమర్ లు యూట్యూబ్, ట్విట్టర్ లలో డైరెక్ట్ సపోర్ట్ పొందలేరు. అన్న్నీ అనుకూలంగా జరిగితే... వచ్చేనెల నుండి కస్టమర్ల డైరెక్ట్ మెసేజ్ లకు వ్యక్తిగతంగా సమాధానాలివ్వడం ఆపివేస్తుందన్నమాట.
ఈ తాజా నిర్ణయం ప్రకారం అక్టోబర్ నుంచి ట్విటర్ లోని యాపిల్ సపోర్ట్ అనే అకౌంట్ పని చేయదు. దీనికి బదులుగా కస్టమర్ లు సపోర్ట్ కోసం ఆటోమేటెడ్ సమాధానాలపై దృష్టి పెడుతోందని తెలుస్తోంది. దీనికి ఫోన్ సపోర్ట్ అందించడానికి ఉద్యోగులకు శిక్షణ ఇవ్వనుందని అంటున్నారు.
ఈ విషయంలో కాస్త సీరియస్ గా ఉన్న యాపిల్ సంస్థ... దీనిపై పని చేయ కూడదనుకునే వారు యాపిల్ వెలుపల ఉద్యోగం చూసుకోవాలని కూడా కాస్త ఘాటుగానే సూచించినట్టు తెలుస్తోంది.
అయితే... 2016నుంచి ట్విటర్ (ఎక్స్) ద్వారా కస్టమర్ మద్దతును అందిస్తోంది. అయితే... గత ఏడాది ఎలాన్ మస్క్ చేతిలోకి ట్విటర్ వెళ్లిన తర్వాత యాపిల్ మరో ఆలోచన చేసింది. ఇందులో భాగంగా... ఇటీవల జరిగిన సమావేశంలో ఉద్యోగులతో.. ఫోన్ బేస్‌డ్ సపోర్ట్ నిర్ణయాన్ని సమర్ధించుకున్నట్టు తెలుస్తోంది.
మరోవైపు ఈ నెల 12న ఈ ఏడాది మెగా ఈవెంట్ ను నిర్వహించనుంది యాపిల్. ఇందులో భాగంగా... ఐఫోన్ 15 సిరీస్ ఫోన్లను లాంచ్ చేయనుంది. ఇదే ఈవెంట్ లో కొత్త యాపిల్ వాచ్ లను కూడా ప్రకటించే అవకాశం ఉంది. భారత్ కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల ఆవిష్కరణ ప్రారంభం అవుతుంది.