జగన్ గుడ్ - బాబు హ్యాపీ... అసదుద్ధీన్ సంచలన వ్యాఖ్యలు!

అసదుద్దీన్ ఓవైసీ... రెండు రాష్ట్రాల్లోనూ పాలనా వ్యవహారాలు, పార్టీ విస్తరణ, పొత్తు మొదలైన అంశాలపై చర్చించారు.

Update: 2023-09-26 05:00 GMT

స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెను సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అరెస్టు, రిమాండ్ అనంతరం ఒక్కసారిగా పరిస్థితులన్నీ మారిపోయాయి. ఇదే సమయంలో టీడీపీ - జనసేన పొత్తు కూడా అధికారికంగా పొడించింది! ఈ సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ పై ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవును... ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్ గా మారిన “చంద్రబాబు @ రాజమండ్రి సెంట్రల్ జైలు” అనే విషయం పై తాజాగా మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ స్పందించారు. ఈ సందర్భంగా అటు చంద్రబాబుతో పాటు, ఇటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనపైనా సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయిన అసదుద్దీన్ ఓవైసీ... రెండు రాష్ట్రాల్లోనూ పాలనా వ్యవహారాలు, పార్టీ విస్తరణ, పొత్తు మొదలైన అంశాలపై చర్చించారు. అనంతరం చంద్రబాబు అరెస్ట్ గురించి స్పందించారు. ఇందులో భాగంగా... చంద్రుడు ఆంధ్రప్రదేశ్‌ లోని జైల్లో చాలా హ్యాపీగా ఉన్నారని, ఆయన జైలు ఎందుకు వెళ్లారో మీ అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో... ఏపీలో ప్రస్తుతం రెండే పార్టీలు ఉన్నాయని చెప్పిన ఒవైసీ... అందులో ఒకటి టీడీపీ అయితే రెండోది జగన్‌ పార్టీ వైసీపీ అని అన్నారు. జనసేన ప్రస్తుతం టీడీపీతో పొత్తులో ఉంది గనుక దాన్ని పరిగణలోకి తీసుకోలేదా.. లేక, మరో కారణం ఉందా అనే విషయం సంగతి కాసేపు పక్కన పెడితే.. ఈ సందర్భంగా జగన్ పాలనపైనా ఒవైసీ స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ లో ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి పాలనపై స్పందించిన అసదుద్ధీన్ ఒవైసీ... మంచి పాలన అందిస్తున్నారని కితాబిచ్చారు. అయితే... చంద్రబాబును మాత్రం ఎప్పటికీ నమ్మలేమని, ప్రజలు కూడా ఆయన్ని ఎప్పుడూ నమ్మొద్దంటూ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ కోరాడం గమనార్హం! ఇదే సమయంలో ఏపీలో పోటీపై కూడా ఒవైసీ స్పందించారు.

ఇదే సమయంలో... ఆంధ్రప్రదేశ్‌ లో కూడా పోటీ చేసే యోచనలో ఉన్నట్టు తెలిపారు. ఇదే సమయంలో ఏపీలో కూడా మనం పనిచేయాల్సిన అవసరం ఉందని కార్యకర్తలకు సూచించారు. దీంతో చంద్రబాబు అరెస్ట్ పై ఒవైసీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై టీడీపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారనేది వేచి చూడాలి.

Tags:    

Similar News